సెంచరీ కొట్టడానికి సిద్ధమైన ఇస్రో
నేడు శ్రీహరికోటలో వందో రాకెట్ ప్రయోగం
Advertisement
కొన్నిరోజుల కిందటి వరకు విదేశాలతో పోటీ పడిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. ఇప్పుడు తనతో తానే పోటీ పడుతున్నది. స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగింది. తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్న పేరూ తెచ్చుకున్నది. ఈ క్రమంలోనే బుధవారం వందో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్‌ను నింగిలోకి పంపడానికి అంతా సిద్ధం చేసింది. తొలిరోజుల్లో ఏడాదికి ఒక ప్రయోగాన్ని నిర్వహించడం కూడా ఇస్రోకు గగనంగా ఉండేది. తర్వాత ఏటా 4 నుంచి పది ప్రయోగాలు చేపట్టే స్థాయికి చేరుకున్నది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య 15కు పెంచేలా షార్‌లో మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే వీటిలో 80 శాతం పనులు పూర్తయ్యాయి.
Advertisement