వాట్సాప్ 'క్రియేట్ కాల్‌ లింక్' ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..

వాట్సాప్‌ కొత్తగా గ్రూప్ కాలింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. జూమ్, గూగుల్ మీట్ తరహాలో ఎక్కువమంది యూజర్లు ఒకేసారి కాల్‌లో పాల్గొనేందుకు ఈ ఫీచర్ పనికొస్తుంది. ‘క్రియేట్‌ కాల్‌ లింక్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌

Advertisement
Update:2022-10-27 12:45 IST

వాట్సాప్‌ కొత్తగా గ్రూప్ కాలింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. జూమ్, గూగుల్ మీట్ తరహాలో ఎక్కువమంది యూజర్లు ఒకేసారి కాల్‌లో పాల్గొనేందుకు ఈ ఫీచర్ పనికొస్తుంది. 'క్రియేట్‌ కాల్‌ లింక్‌' పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌.. ఇతర గ్రూప్ కాలింగ్ యాప్‌లకు దీటుగా ఉండబోతుంది. ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందంటే..

ముందుగా వాట్సాప్‌ యాప్‌ ఓపెన్‌ చేసి, చాట్‌ పేజీలో 'కాల్స్‌' ఐకాన్‌పై క్లిక్ చేస్తే 'క్రియేట్ కాల్‌ లింక్‌' ఫీచర్‌ కనిపిస్తుంది.

దానిపై క్లిక్ చేస్తే కాల్‌ టైప్‌ :- ఆడియో/వీడియో , సెండ్‌ లింక్‌ వయా వాట్సాప్‌, కాపీ లింక్‌ , షేర్ లింక్‌ ఆప్షన్లు కనిపిస్తాయి.

యూజర్‌ ఎంచుకున్న కాల్‌ టైప్‌ ఆధారంగా లింక్‌ క్రియేట్ అవుతుంది. ఆ లింక్‌ను యూజర్‌ వాట్సాప్‌ ద్వారా ఇతరులకు షేర్ చేయొచ్చు.

ఇతర యూజర్లు లింక్‌పై క్లిక్ చేస్తే జాయిన్‌, లీవ్‌ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో 'జాయిన్‌'పై క్లిక్‌ చేస్తే గ్రూపు కాల్‌లో జాయిన్ అవ్వొచ్చు. 'లీవ్'పై క్లిక్ చేస్తే కాల్ నుంచి ఎగ్జిట్ అవ్వొచ్చు.

ఈ ఫీచర్ ప్రత్యేకత ఏంటంటే.. యూజర్‌ ఒకసారి క్రియేట్ చేసిన లింక్‌ 90 రోజులపాటు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ లింక్‌ ద్వారా ఒకేసారి 32 మంది గ్రూప్ కాల్‌లో జాయిన్ అవ్వొచ్చు. త్వరలో ఈ సంఖ్యను పెంచనున్నట్లు వాట్సాప్ చెప్తోంది.

Tags:    
Advertisement

Similar News