ఫాస్ట్‌ డెలివరీ, ఆన్‌-టైమ్‌ గ్యారెంటీ కోసం స్విగ్గీ సరికొత్త ప్లాన్‌

‘One BLCK’ పేరుతో ప్రవేశపెట్టిన దీని ధర ప్రయోజనాలు ఏమిటంటే?

Advertisement
Update:2024-12-12 12:20 IST

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ స్పెషల్‌ మెంబర్‌షిప్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. మెరుగైన సేవలు, సౌలభ్యం కోరుకొనే వినియోగదారుల కోసం ‘One BLCK’ పేరుతో దీన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. అయితే ఈ మెంబర్‌షిప్‌ పొందాలంటే స్విగ్గీ నుంచి స్పెషల్‌ ఇన్విటేషన్‌ అందాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన సభ్యులకు మాత్రమే ఈ మెంబర్‌షిప్‌ ప్లాన్‌ ప్రయోజనాలు వినియోగించుకోవచ్చు.

స్విగ్గీ వన్‌ బ్లాక్‌ సర్వీసులతో ప్రతి ఫుడ్‌ ఆర్డపై ఫాస్ట్‌ డెలివరీ, ఆన్‌-టైమ్‌ గ్యారెంటీ పొందవచ్చు. డైనింగ్‌ఔట్‌ సమయంలో కాంప్లిమెంటరీగా కాక్‌టెయిల్స్‌, డ్రింక్స్‌, డెజర్ట్స్‌ ఆస్వాదించొచ్చు అని స్విగ్గీ తన స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఫైలింగ్‌లో తెలిపింది. అంతేకాదు వన్‌ క్లాక్‌ కస్టమర్లు ఇన్‌స్టా మార్ట్‌లో ఉచిత డెలివరీలు, డైన్‌అవుట్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌తో సహా 'స్విగ్గీ వన్‌' మెంబర్‌షిప్‌లోని అన్ని ప్రయోజనాలు పొందుతారు.

అమెజాన్‌ ప్రైమ్‌, హాట్‌స్టార్‌ వంటి అగ్ర భాగస్వామి బ్రాండ్‌ల నుంచి ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా పొందవచ్చని వెల్లడించింది. లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా వన్‌ బ్లాక్‌ సభ్యులకు కాంప్లిమెంటరీగా యాత్రా ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ అందించనున్నట్లు తెలిపింది. స్విగ్గీ వన్‌ బ్లాక్‌ 3 నెలల ప్లాన్‌ ధర రూ. 299గా కంపెనీ నిర్ణయించింది. ఈ మెంబర్‌షిప్‌ కోసం ఇన్విటేషన్‌ కస్టమర్లకు దశలవారీగా అందుతాయని ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ తెలిపింది. ఇప్పటికే స్విగ్గీ వన్‌ తీసుకున్న సభ్యులూ ఈ కొత్త మెంబర్‌షిప్‌ అప్‌గ్రేడ్‌ అవొచ్చని పేర్కొన్నది. 

Tags:    
Advertisement

Similar News