వాట్సప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే
చదవకుండా వదిలేసి మరచిపోయిన మెసేజ్‌లను గుర్తుచేయనున్న న్యూ ఫీచర్
చిన్న మెసేజ్‌లు పంపాలన్నా, ఫొటోలు, వీడియోలు షేర్ చేయాలన్నా వెంటనే గుర్తుకువచ్చేది వాట్సప్. దీంతో పెద్ద ఎత్తున మెసేజ్‌లు వచ్చి చేరుతుంటాయి. వాటిలో ముఖ్యమైనవి చూసి.. మిగిలినవి తర్వాత చూద్దామని సాధారణంగా అందరూ వదిలేస్తుంటారు. దీంతో కొన్ని చాట్‌లు మరుగునపడిపోతుంటాయి. అలా వదిలేసిన చాట్‌లను రిమైండ్ చేయాలనే ఉద్దేశంతో వాట్సప్ కొత్త ఫీచర్ తీసుకురానున్నది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పోస్ట్‌లో వెల్లడించింది.
వాట్సప్‌లో రానున్న కొత్త ఫీచర్ మెసేజ్ రిమైండర్. అప్లికేషన్‌లో చదవకుండా వదిలేసిన మెసేజ్ ఇది గుర్తు చేస్తుంది. అయితే గతంలో స్టేటస్ అప్‌డేట్లను రిమైండింగ్ కోసం మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఫీచర్.. తాజాగా చాట్‌లలో చదవని మెసేజ్‌లను ట్రాక్ చేయడంతో మీకు సాయం చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్ష దశలో భాగంగా ఎంపిక చసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానున్నది. లైవ్‌లోకి రాగానే గుర్తుచేస్తుంది. Settings > Notifications > Reminders ని ఎంపిక చేసుకొని ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. అన్ని కాంటాక్ట్‌లకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుందా? లేదా అనే విషయం తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.