వ్యూస్‌ కోసం సంబంధం లేని థంబ్‌ నెయిల్స్‌ పెడితే చానల్‌ ఔట్‌!

కఠినమైన నిబంధనలు తీసుకురాబోతున్న యూట్యూబ్‌

Advertisement
Update:2024-12-20 18:21 IST

వ్యూస్‌ కోసం సంబంధం లేని థంబ్‌ నెయిల్స్‌, టైటిల్స్‌ పెట్టే యూట్యూబ్‌ చానెళ్లకు త్వరలోనే కష్టకాలం రాబోతుంది. వ్యూయర్స్‌ను తప్పుదోవ పట్టించేలా పెడుతున్న థంబ్‌ నెయిల్స్‌, టైటిల్స్‌ యూట్యూబ్‌ దృష్టి పెట్టింది. ఇండియాలో పెద్ద సంఖ్యలో యూట్యూబ్‌ చానల్స్‌ ఉండగా, వాటిలో ఎక్కువ చానల్స్‌ వ్యూయర్‌షిప్‌ పెంచుకునేందుకు ఇంట్రస్టింగ్‌ థంబ్‌ నెయిల్స్‌, టైటిల్స్‌ పెడుతున్నాయి. వ్యూయర్స్‌ వాటిని చూసి ఎట్రాక్ట్‌ అయి ఆ కంటెంట్‌ క్లిక్‌ చేస్తున్నారు. తీరా ఆ వీడియో ప్లే అయ్యాక థంబ్‌ నెయిల్‌ ఉన్న కంటెంట్‌తో సంబంధమే ఉండటం లేదు. దీంతో వ్యూయర్స్‌ విసుగెత్తిపోతున్నారు. యూట్యూబ్‌ కు ఇలాంటి వాటిపై పెద్ద సంఖ్యలో నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ వస్తోంది. ఈ నేపథ్యంలో యూట్యూబ్‌ జాగ్రత్తలు మొదలు పెట్టింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వీడియోలు పోస్ట్‌ చేస్తున్న చానల్స్‌ పై త్వరలోనే కఠిన చర్యలు తీసుకోనుంది. అలాగే కొత్త నిబంధనలు కూడా తీసుకురాబోతుంది. ఆయా నిబంధనలు ఫాలో అయ్యేందుకు కంటెంట్‌ క్రియేటర్లకు కొత్త టైం ఇవ్వనుంది. ఆ తర్వాత కూడా నిబంధనలకు విరుద్దంగా వీడియోలు అప్‌లోడ్‌ చేస్తే వాటిని యూట్యూబ్‌ మొదట డిలీట్‌ చేస్తోంది. తర్వాత కూడా నిబంధనలు ఫాలో కాకుండా ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెడితే స్ట్రైక్స్‌ వేస్తుంది. తద్వారా ఆ యూట్యూబ్‌ చానల్‌ నే ఔట్‌ చేసేలా కఠిన నిబంధనలు తీసుకురాబోతుంది.

Tags:    
Advertisement

Similar News