ఓపెన్ ఏఐ వేగు సుచిర్ బాలాజీ అనుమానాస్పద మృతి
ప్రాథమిక విచారణ అనంతరం ఇది ఆత్యహత్య అని భావిస్తున్న పోలీసులు
Advertisement
చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ వేగు సుచిర్ బాలాజీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించారు. నవంబర్ 26న అతను మరణించగా.. ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు తాజాగా అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రాథమిక విచారణ అనంతరం ఇది ఆత్యహత్య అని పోలీసులు భావిస్తున్నారు. ఓపెన్ ఏఐ ఆపరేషన్లు, అనుసరిస్తున్న విధానాలు ఆందోళనకరంగా ఉన్నట్లు గతంలో తన రీసెర్చ్ ద్వారా బాలాజీ వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టులో ఓపెన్ ఏఐకి రాజీనామా చేసిన తర్వాత ఆ కంపెనీ పలు కాపీరైట్ల ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని బాలాజీ ఆరోపించారు. ఆ విమర్శలపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నర్మగర్భంగా స్పందించారు.
Advertisement