ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌.. మరోసారి గడువు పొడిగింపు

కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనున్న సమయంలో ఉడాయ్‌ కీలక నిర్ణయం

Advertisement
Update:2024-12-14 13:12 IST

ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనున్న సమయంలో భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ ( UIDAI )కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ గడువును మరోసారి పెంచుతున్నట్లు ఉడాయ్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. 2025 జూన్‌ 14 వరకు అంటే ఏకంగా ఆరు నెలల గడువు పెంచింది. దీంతో ఆధార్‌కార్డులో చిరునామా మార్పులు చేసుకోవాలనుకొనేవారు వెంటనే ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోండి.

యూఐడీఏఐ నిబంధల ప్రకారం.. ప్రతి ఐదేళ్లకొకసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆయా గుర్తింపు పత్రాలు సమర్పించాలి. ఉచిత సేవలు 'మై ఆధార్‌' పోర్టల్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పుట్టినతేదీ, చిరునామా వంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్‌ కేంద్రాల్లో రూ. 50 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో సులువుగా ఇలా..

  • ఆన్‌లైన్‌లో ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ చేయాలంటే ముందుగా యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ఆధార్‌ నంబర్‌తో లాగిన్‌ కావాలి.
  • రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీతో లాగిన్‌ అయిన వెంటనే అప్పటికే ఉన్న మీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • అందులో వివరాలన్నీ సరైనవో, కాదో చెక్‌ చేసుకోండి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేసేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్‌ చేయాలి.
  • తర్వాత కనిపించే డ్రాప్‌డౌడ్‌ లిస్ట్‌ సాయంతో డాక్యుమెంట్లను ఎంచుకోవాలి.
  • ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్‌ కాపీలను అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌పై క్లిక్‌ చేయాలి.
  • 14 అంకెల 'అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌' వస్తుంది. దీనిద్వారా అప్‌డేట్‌ స్టేటస్‌ ఎక్కడివరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవచ్చు. 
Tags:    
Advertisement

Similar News