వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై టెక్ట్స్‌లకు కూడా 'వ్యూవ్ వన్స్'

ఏదైనా ఇన్‌ఫర్మేషన్ లేదా పర్సనల్ విషయాన్ని కేవలం ఒకే సారి ఎదుటి వ్యక్తి చదవాలని, దాన్ని ఇతరులకు చూపించకూడదని అనుకుంటే ఈ ఫీచర్ ద్వారా మెసేజ్ పంపవచ్చు.

Advertisement
Update:2022-12-13 17:18 IST

అత్యంత ఆదరణ పొందిన ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ 'వాట్సప్'లో కొత్త ఫీచర్లు తీసుకొని వచ్చేందుకు దాని మాతృసంస్థ మెటా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇప్పుడు సామాన్యుడి జీవితంలో కూడా భాగమైన వాట్సప్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఫోన్‌లో డేటా ఎక్కువగా వేస్ట్ కాకుండా.. బ్యాకప్ కూడా వృధా కాకుండా ఇప్పటికే 'డిస్ అప్పియరింగ్' అనే ఫీచర్ తీసుకొని వచ్చింది. మనం నిర్దేశించిన సమయంలోపు ఆ మెసేజ్ ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతుంది.

ఇక మనం ఇతరుకు పంపిన ఫొటోలు, వీడియోలు వాళ్లు కేవలం ఒక్క సారి మాత్రమే చూసేలా.. కనీసం స్క్రీన్ షాట్ కూడా తీసుకునే వీలు లేకుండా చేసేలా ఇప్పటికే ఒక ఫీచర్ తీసుకొని వచ్చింది. 'వ్యూ వన్స్' పేరుతో తీసుకొని వచ్చిన ఈ ఫీచర్ చాలా మందికి ఉపయోగపడుతోంది. ఎదుటి వ్యక్తులు మనం పంపిన వీడియో, ఫొటోలు చూడగానే అవి డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు అదే ఫీచర్‌ను టెక్ట్స్ మెజేజీలకు కూడా అమలు చేయాలని భావిస్తున్నది.

ఏదైనా ఇన్‌ఫర్మేషన్ లేదా పర్సనల్ విషయాన్ని కేవలం ఒకే సారి ఎదుటి వ్యక్తి చదవాలని, దాన్ని ఇతరులకు చూపించకూడదని అనుకుంటే ఈ ఫీచర్ ద్వారా మెసేజ్ పంపవచ్చు. టెక్ట్స్ వన్స్ ఫీచర్‌ను కనుక మెసేజెస్‌కు కూడా ఇంప్లిమెంట్ చేస్తే దాని కోసం ప్రత్యేకంగా ఒక సెండ్ బటన్ యాడ్ చేసే అవకాశం ఉంటుంది. మనం పంపే మెసేజ్ కేవలం చదవడానికే వీలుంటుంది. ఇతరులకు ఫార్వర్డ్ చేయడానికి వీలుండదు. ఇప్పటికే కొంత మంది ఆండ్రాయిడ్ యూజర్లకు బీటా వెర్షన్2లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫీచర్‌ను అందరికీ పూర్తి స్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది మాత్రం తెలియరాలేదు.

Tags:    
Advertisement

Similar News