వాట్సాప్‌తో డీప్ ఫేక్‌కు చెక్!
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేసే వాట్సాప్ తాజాగా డీప్ ఫేక్‌ను అరికట్టేందుకు కొత్త హెల్ప్‌లైన్‌ను తీసుకురానుంది.
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేసే వాట్సాప్ తాజాగా డీప్ ఫేక్‌ను అరికట్టేందుకు కొత్త హెల్ప్‌లైన్‌ను తీసుకురానుంది. ఇదెలా పనిచేస్తుందంటే..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నకిలీ వ్యక్తులను సృష్టించే డీప్ ఫేక్ టెక్నాలజీతో ఇటీవల కొన్ని ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. ఈ తరహా మోసాలను అరికట్టేందుక వాట్సాప్ ప్రత్యేక ఫ్యాక్ట్ చెక్ హెల్ప్ లైన్‌ను రూపొందించనున్నట్టు పేర్కొంది.
ఇంటర్నెట్‌లో కనిపించే వీడియోల్లో ఏది నిజమైనది? ఏది నకిలీ? అన్నది తెలుసుకునేలా వాట్సాప్.. ‘మిస్‌ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్’ అనే సంస్థతో కలిసి ఓ ప్రత్యేక హెల్ప్ లైన్‌ను రూపొందించనుంది. ఇది వచ్చేనెల నుంచి అందుబాటులో ఉండనుంది.
ఈ ప్రత్యేక హెల్ప్‌లైన్ సాయంతో డీప్ ఫేక్ వీడియోలను సులభంగా గుర్తించే వీలుంటుంది. తప్పుడు సమాచారాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళం.. ఇలా వివిధ బాషల్లో అందుబాటులో ఉండే ఈ హెల్ప్ లైన్ ద్వారా యూజర్లు తమ దగ్గరకు వచ్చిన వీడియోలను చెక్ చేసుకోవచ్చు. ఇలా యూజర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందిచేందుకు ‘డీప్‌ఫేక్ ఎనాలసిస్ యూనిట్’ ను రూపొందిస్తున్నట్టు వాట్సాప్ చెప్తోంది.
ఫేక్ సమాచారాన్ని గుర్తించడం, అరికట్టడంలో భాగంగా యూజర్లను అప్రమత్తం చేసేందుకు గానూ వాట్సాప్ ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్టు మెటా ప్రకటించింది. ఏదైనా సమాచారాన్ని ఫార్వార్డ్ చేసేముందు ఒకరికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని యూజర్లకు సూచించింది.
ఇకపోతే రీసెంట్‌గా వాట్సాప్‌లో ఛానెల్స్ ఓనర్‌షిప్‌ను మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేసే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ సాయంతో ఛానెల్ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఓనర్‌షిప్‌ను వేరొకరికి బదిలీ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.
దీంతోపాటు వాట్సప్ వెబ్ వెర్షన్‌లో చాట్ లాక్ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ ఇటీవల ప్రకటించింది. అలాగే వాట్సాప్ లో ‘నియర్‌బై షేర్’ ఫీచర్ కూడా త్వరలోనే అందుబాటులో వస్తుంది.