ఆండ్రాయిడ్‌లో కొత్త వైరస్.. ఈ యాప్స్ డిలీట్ చేయండి!

Sharkbot Malware: కొత్తగా 'షార్క్‌బోట్‌' అనే మాల్‌వేర్‌ వైరస్ ప్లేస్టోర్‌‌లోకి చొరబటినట్టు, ఆరు యాప్స్‌లో ఈ మాల్‌వేర్ ఉన్నట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థలు గుర్తించాయి.

Advertisement
Update:2022-11-30 13:30 IST

Sharkbot Malware: ఆండ్రాయిడ్‌లో కొత్త వైరస్.. ఈ యాప్స్ డిలీట్ చేయండి!

చడీచప్పుడు లేకుండా కొన్ని మాల్‌వేర్ వైరస్‌లు ప్లేస్టోర్‌‌లోని యాప్స్‌లోకి చొరబడుతున్నాయి. యూజర్ల డేటాను దొంగిలించేందుకు సైబర్ నేరగాళ్లు ఇలాంటి మాల్‌వేర్స్ రూపొందిస్తున్నారు. తాజాగా 'షార్క్ బోట్' అనే మాల్‌వేర్.. ప్లే స్టోర్‌‌లోని కొన్ని యాప్స్‌లో ఉన్నట్టు గూగుల్ గుర్తించింది. దీనికి సంబంధించిన కొన్ని యాప్స్‌ను డిలీట్ చేయమని యూజర్లను కోరింది.

కొత్తగా 'షార్క్‌బోట్‌' అనే మాల్‌వేర్‌ వైరస్ ప్లేస్టోర్‌‌లోకి చొరబటినట్టు, ఆరు యాప్స్‌లో ఈ మాల్‌వేర్ ఉన్నట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థలు గుర్తించాయి. ఎక్స్‌ఫైల్‌ మేనేజర్‌ (X-File Manager), ఫైల్‌వాయోజర్‌ (FileVoyager), ఫోన్‌ఏఐడీ (PhoneAID), క్లీనర్‌ (Cleaner), బూస్టర్‌ 2.6 (Booster 2.6), లైట్‌ క్లీనర్‌ ఎమ్‌ (LiteCleaner M) అనే ఆరు యాప్‌ల ద్వారా ఈ మాల్‌వేర్ యూజర్ల మొబైల్‌లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వార సైబర్ నేరాలకు హెల్ప్ చేస్తుంది. అందుకే ఈ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే వెంటనే డిలీట్ చేయమని గూగుల్ కోరుతోంది.

ప్లే స్టోర్ నుంచి ఈ ఆరు యాప్స్‌ను తొలగించినట్టు గూగుల్ ప్రకటించింది. అయితే ఈలోపే వేల మంది యూజర్లు ఈ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌లలో మొదటి మూడు ఫైల్‌ మేనేజ్‌మెంట్‌ కేటగిరీకి చెందినవి కాగా, మిగిలిన మూడు ఫోన్‌ క్లీనింగ్ యాప్‌లు. యూజర్లు వీటిని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత యూజర్‌ డేటాకు సంబంధించిన పర్మిషన్స్ అడుగుతుంది. యాప్‌లకు ఫోన్‌ డేటా యాక్సెస్‌ లభించాక యూజర్‌ బ్యాంకింగ్ వివరాలతోపాటు, ఇతర యాప్‌ల లాగిన్ వివరాలు సేకరిస్తాయి. అలా ఇవి యూజర్ల అకౌంట్లలోని డబ్బుని దొంగిలించడానికి సహకరిస్తాయి.

అందుకే ఇప్పటికే ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్లు వెంటనే వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేసి, మొబైల్‌లో బ్యాంకింగ్‌తోపాటు, ఇతర యాప్‌ల లాగిన్‌, పాస్‌వర్డ్‌ వివరాలు మార్చుకోవాలని గూగుల్ సూచించింది. ఇలాంటి యాప్‌ల నుంచి తప్పించుకునేందుకు యాజర్లు ప్లే ప్రొటెక్ట్‌ సర్వీస్‌ ఎనేబుల్‌ చేసుకోవడంతోపాటు, ఆండ్రాయిడ్ యాంటీవైరస్‌ యాప్‌లను డివైజ్‌లో యాక్టివ్‌లో ఉంచుకోవాలని టెక్ నిపుణులు చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News