వాట్సప్ నుంచి మాయం కానున్న నెంబర్లు.. భారీ మార్పులు చేస్తున్న మెటా

ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా 2.23.11.15 వెర్షన్‌లో కనిపించినట్లు డబ్ల్యూఏబీటాఇన్ఫో తెలియజేసింది.

Advertisement
Update:2023-05-25 21:12 IST

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది యూజర్లను కలిగి ఉన్న ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్. మెటా సంస్థ కొనుగోలు చేసిన తర్వాత వాట్సప్‌లో అనేక ఫీచర్లను యాడ్ చేసింది. అంతే కాకుండా యూజర్ల ప్రైవసీకి కూడా పెద్ద పీట వేస్తున్నట్లు పేర్కొన్నది. యూజర్ ఫ్రెండ్లీగా మార్చడంతో పాటు వారి హక్కులకు భంగం కలిగించని విధంగా వాట్సప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. ఈ క్రమంలో మరో సరికొత్త ఫీచర్‌ను వాట్సప్ అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఇకపై వాట్సప్ కాంటాక్ట్ నెంబర్లు యాప్ నుంచి మాయం కానున్నాయి. వాటి స్థానంలో యూజర్‌ నేమ్‌ను తీసుకొని రావాలని నిర్ణయించింది.

ఇప్పటి వరకు మనం ఎవరికైనా మెసేజ్ చేస్తే.. అవతలి వ్యక్తుల కాంటాక్ట్ లిస్టులో ఉంటే వాళ్లు సేవ్ చేసుకున్న పేరు.. లేకపోతే మన కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంటుంది. దీని వల్ల ఒక్కోసారి మెసేజ్ చేసిన వారి ప్రైవసీకి భంగం కలుగుతోంది. అందుకే యునీక్ యూజర్ నేమ్ ఫీచర్ తీసుకొని వస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా 2.23.11.15 వెర్షన్‌లో కనిపించినట్లు డబ్ల్యూఏబీటాఇన్ఫో తెలియజేసింది.

వాట్సప్‌లోని ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లి యూజర్ నేమ్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా యూనిక్ యూజర్ నేమ్ సెట్ చేసుకున్న వారి నెంబర్లు బయటకు కనిపించవు. అదే యూజర్ నేమ్‌తో మన కాంటాక్ట్స్‌లో ఉన్న వారితో పాటు.. బయటి వాళ్లతోనే చాట్ చేసుకోవచ్చు. గ్రూప్‌లలో కూడా మన నెంబర్ కనిపించకుండా.. కేవలం యూజర్ నేమ్‌తోనే చాట్ చేసే అవకాశం ఉంటుంది.

కాగా, ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉన్నదని.. దీని వల్ల కలిగే లాభనష్టాలను కూడా అధ్యయనం చేస్తున్నారని డబ్ల్యూఏఇన్ఫోబీటా తెలిపింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. మనకు కాంటాక్ట్ నెంబర్ తెలియకపోయినా.. యూజర్ నేమ్ ద్వారా సెర్చ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే దీని వల్ల యూజర్ల ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉన్నందున టెక్ నిపుణులు దీనికి ఒక పరిష్కారం కనుగొంటారని తెలుస్తున్నది. అన్ని టెస్టింగ్స్ పూర్తయిన తర్వాత త్వరలోనే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానున్నది.



 


Tags:    
Advertisement

Similar News