నథింగ్ ఫోన్ 2 వచ్చేసింది! ఫీచర్లివే..
నథింగ్ బ్రాండ్ నుంచి వచ్చిన ‘ఫోన్ 1’ ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించింది. ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో నథింగ్ ఫోన్ 1 మార్కెట్లో సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు నథింగ్ కంపెనీ.. తాజాగా రెండో ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
కిందటేడాది నథింగ్ బ్రాండ్ నుంచి వచ్చిన ‘ఫోన్ 1’ ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించింది. ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో నథింగ్ ఫోన్ 1 మార్కెట్లో సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు నథింగ్ కంపెనీ.. తాజాగా రెండో ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సరికొత్త ‘నథింగ్ ఫోన్ 2’ లో పెద్ద బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
డిజైన పరంగా చూస్తే.. నథింగ్ ఫోన్ 2, ఫోన్ 1 కు పెద్దగా తేడా లేదు. అయితే ఫోన్ 2 లో గ్లిఫ్ ఇంటర్ఫేస్‌ను అప్‌డేట్ చేశారు. సిస్టమ్ యాప్‌లతోపాటు డెలివరీ యాప్‌లు, టైమర్ స్టేటస్‌ను తెలుసుకునేందుకు వీలుగా ఎల్‌ఈడీ లైట్స్‌ను కస్టమైజ్ చేశారు.
నథింగ్ ఫోన్ 2..ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పనిచేస్తుంది. ఇందులో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4700 ఎంఏహెచ్ బ్యాటరీ మంచి బ్యాకప్ ను అందిస్తుంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. ఇందులో వెనుక వైపు రెండు 50 ఎంపీ కెమెరాలు, ముందువైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. మూడు హై-డెఫినిషన్ మైక్రోఫోన్‌లు, రెండు స్టీరియో స్పీకర్ సెటప్ ఉంది. 4,700 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ పీపీఎస్ వైర్డ్, 15 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 55 నిమిషాల్లో, ఫోన్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. నథింగ్ ఫోన్ 2 ని వైర్ లెస్ ఛార్జర్ గా కూడా వాడుకోవచ్చు. ఫోన్ వెనుకవైపు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే డివైజ్‌లను ఉంచితే ఆటోమేటిక్‌గా చార్జ్ అవుతుంది. అలాగే ఈ ఫోన్‌కు రెండు వైపులా కార్న్ గొరిల్లా గ్లాస్ ఉంటుంది.
నథింగ్ ఫోన్ 2ను బేస్ వేరియంట్ (8జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్) రూ. 44,999 ఉంది.12జీబీ/256జీబీ వేరియంట్ ధర రూ. 49,999, 12జీబీ/512జీబీ వేరియంట్ ధర రూ. 54,999గా ఉంది. జులై 21 నుంచి ఈ ఫోన్ సేల్స్ మొదలవుతాయి.