గూగుల్ లో వెతికేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయొద్దు!

గూగుల్‌లో అశ్లీలత కు సంబంధించిన విషయాలు, డార్క్ వెబ్, టెర్రరిజం, డ్రగ్స్ లాంటి విషయాలు సెర్చ్ చేయకపోవడమే మంచిది.

Advertisement
Update:2023-01-24 18:38 IST

గూగుల్ లో వెతికేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయొద్దు!

ఈ రోజుల్లో ఏ విషయం తెలుసుకోవాలన్నా.. ముందుగా ఆధారపడేది గూగుల్‌పైనే. రోజూ రకరకాల విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు చాలామంది. అయితే సెర్చ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే.. సెర్చ్ చేసే విషయాలు దొంగచాటుగా సైబర్ నేరగాళ్లు తెలుసుకునే ప్రమాదముంది. అందుకే బ్రౌజింగ్ చేసేటప్పుడు కొన్ని సేఫ్టీ టిప్స్ పాటించడం ముఖ్యం.

ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే.. మన డేటా ఇతరుల చేతిలోకి వెళ్లే ప్రమాదముంది. దీనివల్ల స్పామ్ కాల్స్, సైబర్ క్రైమ్స్ లాంటివి జరుగుతాయి. అందుకే ఇంటర్నెట్ సర్ఫింగ్ చేయడానికిక మంచి బ్రౌజర్‌‌ను ఎంచుకోవాలి.

సేఫ్‌ అండ్ సెక్యూర్ బ్రౌజర్స్‌ వాడకం వల్ల కుకీస్‌ వంటి థర్డ్‌పార్టీ టూల్స్‌ నుంచి తప్పించుకోవచ్చు. క్రోమ్, ఫైర్‌‌ఫాక్స్, సఫారీ, డక్‌డక్ గో లాంటి బ్రౌజర్లు వాడితే.. ప్రమాదకరమైన వెబ్‌లింక్స్‌ వచ్చినప్పుడు అవి అలర్ట్ చేస్తాయి.

గూగుల్‌లో ఏదైనా వెతికినప్పుడు రకరకాల వెబ్‌సైట్లు దర్శనమిస్తాయి. అయితే వాటిలో ‘హెచ్‌టీటీపీఎస్’తో మొదలయ్యే సైట్లను మాత్రమే ఓపెన్ చేస్తే మంచిది.

ఈ మెయిల్‌ లేదా వాట్సాప్‌ లో ఏవైనా యూఆర్‌ఎల్‌ లింక్స్‌ వస్తే.. వాటిని క్లిక్ చేయడానికి ముందు కాపీ చేసి.. ‘ఈజ్ ఇట్ ఫిషింగ్(isitphishing.org)’ అనే వెబ్‌సైట్‌లో పేస్ట్ చేసి అది సేఫా? కాదా? అన్నది తెలుసుకోవచ్చు.

గూగుల్‌లో అశ్లీలత కు సంబంధించిన విషయాలు, డార్క్ వెబ్, టెర్రరిజం, డ్రగ్స్ లాంటి విషయాలు సెర్చ్ చేయకపోవడమే మంచిది.

బ్యాంకు, ఇతర సంస్థలకు చెందిన కస్టమర్‌ కేర్‌ నంబర్లను గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే తప్పు నెంబర్లు లేదా ఫ్రాడ్ నెంబర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే టోల్ ఫ్రీ నెంబర్ల కోసం ఆయా వెబ్‌సైట్లకు వెళ్లడం మంచిది.

బ్రౌజర్ సేఫ్‌గా ఉండాలంటే అది ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉండాలి. అవసరమనుకుంటే బ్రౌజర్లలో యాంటీ వైరస్ ఎక్స్‌టెన్షన్‌లు కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేటప్పుడు ఇన్‌కాగ్నిటో మోడ్‌ ఎంచుకుంటే మీ బ్రౌజింగ్‌ యాక్టివిటీ గూగుల్ లేదా ఇతర సైట్లకు తెలిసే అవకాశం ఉండదు.

బ్రౌజర్ వాడేముందు ప్రైవసీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి నచ్చిన విధంగా ప్రైవసీ మార్పులు చేసుకోవాలి. సెట్టింగ్స్‌ను డీఫాల్ట్‌గా వదిలేయడం మంచిది కాదు.

బ్రౌజర్‌‌తో పని పూర్తయిన తర్వాత సోషల్‌ మీడియా, ఈమెయిల్‌ అకౌంట్లు ఎప్పటికప్పుడు లాగవుట్‌ చేసేయాలి.

Tags:    
Advertisement

Similar News