ఏఐతో క్రియేటివ్‌గా
ఏఐను సరిగ్గా వాడడం తెలిస్తే.. నాలుగు గంటల్లో చేసే పనిని ఒక్క క్లిక్‌తో పూర్తి చేయొచ్చు. ఫొటో ఎడిటింగ్ నుంచి మీమ్స్ క్రియేట్ చేయడం వరకూ ఏఐకి తెలియని పనంటూ లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్కువగా వాడేవాళ్లకు, కంటెంట్ క్రియేటర్లకు కొన్ని ఏఐ టూల్స్ బాగా ఉపయోగపడతాయి.
ఏఐను సరిగ్గా వాడడం తెలిస్తే.. నాలుగు గంటల్లో చేసే పనిని ఒక్క క్లిక్‌తో పూర్తి చేయొచ్చు. ఫొటో ఎడిటింగ్ నుంచి మీమ్స్ క్రియేట్ చేయడం వరకూ ఏఐకి తెలియని పనంటూ లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్కువగా వాడేవాళ్లకు, కంటెంట్ క్రియేటర్లకు కొన్ని ఏఐ టూల్స్ బాగా ఉపయోగపడతాయి. వాటిలో కొన్ని ఇవి..
ఫొటోలతో వీడియో చేయడం కోసం రకరకాల యాప్స్ ఉన్నాయి. అయితే ఏఐ వాటి కంటే బెటర్‌గా ఆ పని చేసిపెడుతుంది. ఫొటోలన్నీ అప్‌లోడ్ చేసి నచ్చిన టెంప్లేట్ ఎంచుకుంటే చిటికెలో ప్రొఫెషనల్ వీడియో రెడీ అవుతుంది. దీనికోసం ‘స్టీవ్. ఏఐ’, ‘డీఐడి.ఏఐ’ లాంటి సైట్స్ వాడొచ్చు. కొత్తగా యూట్యూబ్ ఛానెల్ పెట్టాలనుకునేవాళ్లకు కూడా ఈ టూల్ పనికొస్తుంది. కెమెరా ముందు మాట్లాడే పని లేకుండా ఇందులో మాట్లాడే అవతార్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్ అప్‌లోడ్ చేసి.. అవతార్‌ను సెలక్ట్ చేసుకుంటే చాలు. మిగతా వీడియో అంతా రెడీ అయిపోతుంది. ‘రెడీ టు అప్‌లోడ్’ వీడియోను మనకందిస్తుంది ఈ టూల్. ఇందులో కార్పొరేట్ వీడియోలు, ఎడ్యుకేషనల్ వీడియోలు, ప్రోమో వీడియోలు.. ఇలా రకరకాల వీడియోలు క్రియేట్ చేయొచ్చు.
ఈ మధ్యకాలంలో మీమ్స్‌కి క్రేజ్ పెరిగింది. అయితే మీమ్స్ చేయాలనుకునే వాళ్లు వాటికోసం ఎక్కువగా ఆలోచించే పనిలేకుండా అ పనిని ఏఐకి అప్పచెప్పొచ్చు. ‘సూపర్‌మీమ్. ఏఐ’ అనే టూల్ ఉపయోగించి కొత్తకొత్త క్రియేటివ్ మీమ్స్‌ని రెడీ చేయొచ్చు. మీమ్ కోసం ఏ ఫొటో వాడాలో ఐడియా రానప్పుడు ఈ టూల్ హెల్ప్ అవుతుంది. మీమ్ కోసం వాడాలనుకుంటున్న టెక్ట్స్ లేదా సందర్భాన్ని టైప్ చేస్తే.. రకరకాల జనరేటెడ్ ఏఐ మీమ్స్‌ను చూపిస్తుంది. వాటిలో నచ్చిన దాన్ని సెలక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎమోషన్‌ను సెలక్ట్ చేసుకుని దానికి తగ్గ మీమ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇందులో వందకి పైగా భాషల్లో మీమ్స్ క్రియేట్ చేయొచ్చు. మీమ్ క్రియేటర్స్‌కు ఇది మంచి టూల్.
ఫేడ్ అయిపోయిన పాత ఫొటోలు ఇంట్లో చాలానే ఉంటాయి. అయితే అలాంటి పాత ఫొటోల క్లారిటీ పెంచడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. కానీ.. వాటన్నింటి కంటే ఏఐ ఆ పనిని బెటర్‌గా చేస్తుంది. ఏఐ టెక్నాలజీతో చిటికెలో ఫొటోల క్వాలిటీ పెంచుకోవచ్చు. పాత ఫొటోలను మళ్లీ క్యాప్చర్ చేసి ‘రెమినీ.ఏఐ’ వెబ్సైట్లో అప్‌లోడ్ చేస్తే చాలు. పాత ఫొటో కొత్త రంగులు అద్దుకుంటుంది. అంతేకాదు ఫోన్‌లో ఉండే తక్కువ రిజల్యూషన్ ఫొటోలను కూడా ఈ వెబ్సైట్లో అప్‌లోడ్ చేసి, హై రెజల్యూషన్‌లోకి మార్చుకోవచ్చు. ఈ టూల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పిక్సెల్స్‌ను రీడ్ చేసి వాటిని సరిచేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్, ఫేస్‌ని డిటెక్ట్ చేసి.. కలర్ కరెక్షన్ కూడా చేసేస్తుంది. ముఖం మీద నీడ, డార్క్ సర్కిల్స్ లాంటివి ఉంటే అవి కూడా తీసేస్తుంది.