ఐఓఎస్ 17.1 వస్తోంది! లేటెస్ట్ ఫీచర్లివే..

ఈ నెల 30న యాపిల్ ఐఓఎస్ 17 నుంచి ఫస్ట్ మేజర్ అప్‌డేట్ రానుంది. ఈ అప్‌డేట్‌తో యూజర్ ఎక్స్‌పీరియెన్స్ పూర్తిగా మారిపోనుంది. అలాగే ఐఫోన్స్‌లో ఉన్న కొన్ని బగ్స్ కూడా ఈ అప్‌డేట్‌తో ఫిక్స్ అవ్వనున్నాయి.

Advertisement
Update:2023-10-28 10:45 IST

ఐఓఎస్ 17.1 వస్తోంది! లేటెస్ట్ ఫీచర్లివే..

ఈ నెల 30న యాపిల్ ఐఓఎస్ 17 నుంచి ఫస్ట్ మేజర్ అప్‌డేట్ రానుంది. ఈ అప్‌డేట్‌తో యూజర్ ఎక్స్‌పీరియెన్స్ పూర్తిగా మారిపోనుంది. అలాగే ఐఫోన్స్‌లో ఉన్న కొన్ని బగ్స్ కూడా ఈ అప్‌డేట్‌తో ఫిక్స్ అవ్వనున్నాయి. ఐఓఎస్ 17.1 ప్రత్యేకతలేంటంటే.

రాబోయే ఐఓఎస్ 17.1 అప్‌డేట్‌తో ఐఫోన్ యూజర్లు యాక్షన్ బటన్‌లో కొన్ని మార్పులు ఆశించొచ్చు. యాక్షన్ బటన్‌ ట్యాప్ చేయడం ద్వారా కెమెరా, ఫ్లాష్‌లైట్, ఫోకస్, మాగ్నిఫయర్, వాయిస్ మెమో, మ్యూట్ ఫంక్షన్ వంటి ఫీచర్లు మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ అన్ని ఐఫోన్ సిరీస్‌లకు అప్లై అవుతుంది.

ఐఫోన్ 17 లాంచ్ టైంలో ప్రకటించిన కస్టమైజ్డ్ స్టాండ్‌బై మోడ్ ఫీచర్.. ఈ అప్‌డేట్‌తో అందుబాటులోకి రానుంది. ఐఫోన్‌ యూజర్లు ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు స్క్రీన్‌ను స్మార్ట్ డిస్‌ప్లేగా మార్చుకోవచ్చు. రెడ్ కలర్ నైట్ మోడ్ ఫీచర్, మోషన్ టు వేక్ వంటి ఫీచర్లను ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే ఐఓఎస్ 17.1 అప్‌డేట్‌తో యూజర్లు తమ ఫొటో లైబ్రరీ నుంచి నచ్చిన ఆల్బమ్‌ను ఫొటో షఫుల్ వాల్ పేపర్స్‌గా పెట్టుకోవచ్చు.

లేటెస్ట్ ఐఓఎస్ 17.1.. ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఐఫోన్ ఎక్స్‌ఎస్ మ్యాక్స్ మోడళ్లతో పాటు ఐఫోన్ 11, 12, 13, 14, 15 సిరీస్‌లు, ఐఫోన్ ఎస్‌ఈ (2,3 జనరేషన్) ఫోన్లకు వర్తిస్తుంది. అలాగే ఐఫోన్ 15 సిరీస్ యూజర్లలో కొంతమంది తమ ఫోన్లు 80 శాతానికి మించి ఛార్జ్ అవ్వట్లేదని కంప్లెయింట్ చేశారు. ఐఓఎస్ 17.1 తో ఈ బగ్ ఫిక్స్ అవ్వనుంది.

ఐఓఎస్ 17.1 అప్‌డేట్‌ కోసం ఐఫోన్‌ యూజర్లు ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి ‘జనరల్’ ఆప్షన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై క్లిక్ చేయాలి. అక్కడ ఆటోమేటిక్ అప్‌డేట్‌పై నొక్కితే సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అయ్యి ఇన్‌స్టా్ల్ అవుతుంది.

ఇకపోతే యాపిల్ సంస్థ ఈ నెల 30న నిర్వహించే ‘యాపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌’లో ఓఎస్ 17.1 అప్‌డేట్‌ను రిలీజ్ చేయనుంది. అలాగే ఈ ఈవెంట్‌లో భాగంగా లేటెస్ట్ యాపిల్ మ్యాక్‌బుక్స్‌.. ఎమ్3, ఎమ్3 ప్రో, ఎమ్3 మాక్స్, ఎమ్3 అల్ట్రా అనే నాలుగు మోడల్స్‌ను లాంఛ్ చేయనుంది. వీటిలో లేటెస్ట్ ‘ఎమ్3’ చిప్‌సెట్ ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News