తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థికే ఆధిక్యం

ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్న అధికారులు;

Advertisement
Update:2025-03-05 09:58 IST

కరీంనగర్‌-నిజామాబాద్‌-మెదక్‌-ఆదిలాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతున్నది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొత్తంగా 75,675 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌ రెడ్డికి 70,565 ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి 5,110 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఎస్పీ అభ్యరథి హరికృష్ణకు 60,419 ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు.


Tags:    
Advertisement

Similar News