పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ : జగన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌పై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు;
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ.. జీవితకాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు అంటూ కామెంట్స్ చేశారు. ఏపీ శాసన సభ కూటమిలోని మూడు పార్టీలు ఒక వైపు ఉన్నాయని.. ప్రతిపక్షంగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉంటే.. మూడు సీట్లు గెలిచిన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు.
సీట్లు తక్కువ వచ్చినా.. 40 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ కు లేఖ రాసిన విషయం నిజమే అని.. ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తూనే ఉంటామని జగన్ స్పష్టం చేశారు బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ అని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు మోసం తప్ప ఏమీ చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు.