కేంద్ర మంత్రి అమిత్‌షాతో చంద్రబాబు భేటీ
కేంద్ర మంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు;
Advertisement
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీతో సమావేశం అవుతారు. ఆ తర్వాత ఆయన పెళ్లి వేడుకల్లో హాజరై వైజాగ్‌కు పయనం కానున్నారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏపీకి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టుల అంశాలపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారు. కాగా, ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 7వ తేదీన జరుగనుంది. ఏపీ సచివాలయం మొదటి బ్లాక్‌లోని కేబినెట్ హాల్‌లో మఖ్యమంత్రి నేతృత్వంలో ఈ భేటీ జరుగనుంది.
Advertisement