Telugu Breaking News Live Updates: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లైవ్ అప్డేట్స్
Telugu Breaking News Live Updates Today: ఈరోజు 14 నవంబర్ 2022న లైవ్ అప్డేట్స్: మీకు భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి తాజా వార్తలను తెలుగు గ్లోబల్ బ్లాగ్ అందిస్తుంది.
Telugu Breaking News Live Updates: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లైవ్ అప్డేట్స్
Telugu Breaking News Live Updates: ఈరోజు 14 నవంబర్ 2022న లైవ్ అప్డేట్స్ : మీకు భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి తాజా వార్తలను తెలుగు గ్లోబల్ బ్లాగ్ అందిస్తుంది.
హైదరాబాద్: విషమంగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి.. ఆస్పత్రికి చేరుకున్న హీరో సుధీర్ బాబు
తెలంగాణ అప్డేట్స్: కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ, హైదరాబాద్ మెట్రో ఫేజ్2 విస్తరణకు భారీగా నిధులు కేటాయించాలి. లక్డీకాపూల్–బీహెచ్ఈఎల్, నాగోల్ – ఎల్బీనగర్ మెట్రో అనుసంధానం పనులకు నిధులుఇవ్వాలి. ఇప్పటికే ప్రతిపాదనలు పంపాము, రూ.8,453 కోట్ల పనులకు సూత్రప్రాయ అంగీకారం ఇవ్వాలి-కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ లైవ్ అప్డేట్స్: సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా
హైదరాబాద్ లైవ్ అప్డేట్స్: శంషాబాద్‌లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్ నుండి కడప వెళ్లిన ఇండిగో ఫ్లైట్ 6E 7254 కు కడప లో వాతావరణము అనుకూలించకపోవడంతో తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్.
బయలుదేరిన సమయంలో విమానంలో 53 మంది ప్రయాణీకులు.
ఎర్రగడ్డ ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి తలసాని
కృష్ణ ఆరోగ్యంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం..- వైద్యులు
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు వైద్యులు. తీవ్ర గుండెపోటు రావడంతో అర్ధరాత్రి కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు వెల్లడించారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందన్నారు. వెంటిలేటర్‌పై వైద్యం అందిస్తున్నామన్నారు. 24 గంటల తర్వాతనే కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇవ్వగలమన్నారు.
తెలంగాణ అప్డేట్స్: రేపు టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశాలు.. మోడీకి కౌంటర్ గ్యారెంటీ! - పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
తెలంగాణ అప్డేట్స్: అంకుల్ వాటర్ ప్లీజ్...బాలల దినోత్సవం నాడు, చిన్న పిల్లవాడి కోరికకు స్పందించిన కేటీఆర్ - పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
హైదరాబాద్: హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో సూపర్ స్టార్ కృష్ణ కు కొనసాగుతున్న చికిత్స.
ఆసుపత్రికి వచ్చి వెళ్లిన హీరో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్.
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అనారోగ్యం.. కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న కృష్ఱ.