కోహ్లీ, శ్రేయాస్ హాఫ్‌ సెంచరీలు

వికెట్‌ కోల్పోకుండా నిలకడగా ఆడుతున్న కోహ్లీ, శ్రేయాస్‌

Advertisement
Update:2025-02-23 21:21 IST

ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (20) ఔట్‌ అయ్యాక శుభ్‌మన్‌ గిల్‌, కోహ్లీ నిలకడగా ఆడారు. ఈ క్రమంలోనే అడపాదడపా ఫోర్లు కొడుతూ హాఫ్‌ సెంచరీకి చేరువైన శుభ్‌మన్‌ గిల్‌ (46) అబ్రార్‌ అహ్మద్‌ వేసిన 17.3 ఓవర్‌కు క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 100 రన్స్‌ వద్ద భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది.14 వేల రన్స్‌ పూర్తి చేసి రికార్డు సృష్టించిన కోహ్లీ అదే స్పీడ్‌లో 62 బాల్స్‌లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్‌ అయ్యర్‌ తో కలిసి కోహ్లీ మరో వికెట్‌ పోకుండా రన్స్‌ రాబట్టాడు. ఈ క్రమంలోనే శ్రేయాస్‌, కోహ్లీ దూకుడుగా ఆడుతూ స్కోర్‌ బోర్డు వేగాన్ని పెంచారు. 37ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్‌ స్కోరు 202/2. ఈ ఇద్దరి భాగస్వామ్యం 100 రన్స్‌ పూర్తయ్యాయి. కోహ్లీ (81) శ్రేయస్‌ అయ్యర్‌ (50 ) క్రీజులో ఉన్నారు.భారత జట్టు విజయానికి ఇంకా 41రన్స్‌ కావాలి. 

Tags:    
Advertisement

Similar News