Revolt RV400 BRZ | స్పోర్టీ లుక్‌తో రివోల్ట్ ఆర్వీ400 బీఆర్‌జడ్ ఎలక్ట్రిక్ బైక్.. ఫుల్ చార్జింగ్‌తో 150 కి.మీ దూరం ప్రయాణం..!
ఈ మోటారు సైకిల్ పట్ల ఆసక్తిగల వారు రివోల్ట్ అధికారిక వెబ్‌సైట్ (Revolt's official website) ద్వారా గానీ, డీలర్ ద్వారా గానీ బుక్ చేసుకోవచ్చు. ప్యూర్ ఎకోడ్రిఫ్ట్ 350 (Pure Ecodrift 350), టార్క్ క్రాటోస్ (Torque Kratos), ఓర్క్సా మాంటిస్ (Orxa Mantis) వంటి మోటారు బైక్‌లతో పోటీ పడుతుంది.
Revolt RV400 BRZ | ప్రముఖ రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) తన న్యూ ఎలక్ట్రిక్ బైక్ ఆర్వీ400 బీఆర్‌జడ్ ( RV400 BRZ) భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.1.38 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఈ మోటారు సైకిల్ పట్ల ఆసక్తిగల వారు రివోల్ట్ అధికారిక వెబ్‌సైట్ (Revolt's official website) ద్వారా గానీ, డీలర్ ద్వారా గానీ బుక్ చేసుకోవచ్చు. ప్యూర్ ఎకోడ్రిఫ్ట్ 350 (Pure Ecodrift 350), టార్క్ క్రాటోస్ (Torque Kratos), ఓర్క్సా మాంటిస్ (Orxa Mantis) వంటి మోటారు బైక్‌లతో పోటీ పడుతుంది. రివోల్ట్ ఆర్వీ400 బీఆర్‌జడ్ సింగిల్ చార్జింగ్‌తో 150 కి.మీ దూరం ప్రయాణిస్తుందని రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) ప్రకటించింది.
రివోల్ట్ ఆర్వీ400 బీఆర్‌జడ్ డిజైన్ ఇలా
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న రివోల్ట్ ఆర్వీ400 (Revolt RV400) తరహా డిజైన్ రివోల్ట్ ఆర్వీ400 బీఆర్‌జడ్ (Revolt RV400 BRZ) ఉంటుంది. లైట్ వెయిట్ సింగిల్ క్రెడిల్ ఫ్రేమ్ (lightweight single cradle frame)పై రివోల్ట్ ఆర్వీ బీఆర్‌జడ్ (Revolt RV400 BRZ) నిర్మించారు. మస్క్యులర్ ఫ్యుయల్ ట్యాంక్ (muscular fuel tank), స్టెప్అప్ సింగిల్ పీస్ సీట్ (step-up single-piece seat), పిల్లర్ గ్రాబ్ రెయిల్ (pillar grab rail) తదితర ఫీచర్లు ఉంటాయి. రివోల్ట్ ఆర్వీ400 బీఆర్‌జడ్ (Revolt RV400 BRZ) మోటారు సైకిల్ ఐదు రంగుల్లో లభిస్తుంది. ఈ బైక్ లునార్ గ్రీన్ (Lunar Green), పసిఫిక్ బ్లూ (Pacific Blue), డార్క్ సిల్వర్ (Dark Silver), రెబెల్ రెడ్ (Rebel Red), కాస్మిక్ బ్లాక్ (Cosmic Black) రంగుల్లో అందుబాటులో ఉంటుంది. స్పోర్టీ లుక్‌తో వస్తోంది రివోల్ట్ ఆర్వీ400 బీఆర్‌జడ్.
రివోల్ట్ ఆర్వీ400 బీఆర్‌జడ్ హార్డ్‌వేర్ ఇలా
రివోల్ట్ ఆర్వీ400 బీఆర్‌జడ్ (Revolt RV400 BRZ) ఫోన్ ఓవల్ షేప్డ్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్ (oval shaped LED projector headlight), ఎల్ఈడీ టెయిల్ లైట్స్ (LED taillights), డీఆర్ఎల్స్ టర్న్ సింగిల్ లాంప్ (DRLs turn single lamp), లో బ్యాటరీ ఇండికేటర్ (low battery indicator), కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ (combi-braking system), సైడ్ స్టాండ్ (side-stand) కటాఫ్ ఇంజిన్ (cut-off engine) డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీడ్, బ్యాలరీ లెవల్ తెలిపే ఇండికేటర్, రైడింగ్ మోడ్, టెంపరేచర్ కూడా తెలిపే ఫీచర్లు జత చేశారు.
కంఫర్ట్ రైడింగ్ కోసం రేర్‌లో ఫుల్లీ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్, ఫ్రంట్‌లో సైడ్ డౌన్ (యూఎస్డీ) ఫోర్క్స్, అప్ ఫ్రంట్ ఉంటాయి. ఫ్రంట్ అండ్ రేర్ వీల్స్‌కు డిస్క్ బ్రేక్‌లు కూడా జత చేశారు. ఈ బైక్ 17-అంగుళాల వీల్స్‌పై నడుస్తుంది.
ఇలా రివోల్ట్ ఆర్వీ400 బీఆర్‌జడ్ స్పీడ్
రివోల్ట్ ఆర్వీ400 (Revolt RV400) 3కిలోవాట్ల మిడ్ డ్రైవ్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 4 బీహెచ్పీ విద్యుత్ 170 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఎకో, నార్మల్, స్పోర్ట్ మోడ్స్‌లో లభిస్తుంది. ఫుల్ చార్జింగ్ చేస్తే ఎకో మోడ్‌లో గరిష్టంగా గంటకు 45 కి.మీ, నార్మల్ మోడ్‌లో 65 కి.మీ, స్పోర్ట్ మోడ్‌లో 85 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. మూడు గంటల్లో 75 శాతం, పూర్తిగా బ్యాటరీ రీచార్జి కావడానికి 4.5 గంటలు పడుతుందని రివోల్ట్ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్నదీ బైక్, రిమోట్ స్మార్ట్ సపోర్ట్, రియల్ టైం ఇన్‌ఫర్మేషన్, జియో ఫెన్సింగ్, ఓటీఏ అప్‌డేట్ సపోర్ట్, బైక్ లొకేటర్ తదితర ఫీచర్లు ఉంటాయి. రైడర్ బైక్ శబ్ధం ఎంచుకునే ఆప్షన్ కల్పించారు. రివోల్ట్ నాలుగు సౌండ్ ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ సౌండ్స్ ఎంచుకోవడానికి రైడర్ కంపెనీ నుంచి మై రివోల్ట్ యాప్ ఎంచుకోవాలి. మ్యూట్ ఆప్షన్ కూడా రైడర్ ఎంచుకోవచ్చు.