జొమాటో సీఈవోకు చేదు అనుభవం..ఏమైందంటే?

డెలివరీ బాయ్ గా వెళ్లిన జొమాటో సీఈఓకు చేదు అనుభవం ఎదుర్కొంది. మాల్‌ లిఫ్ట్‌లోకి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించని అనుమతించలేదు

Advertisement
Update:2024-10-07 11:51 IST

జొమాటో డెలివ‌రీ బాయ్స్ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను స్వయంగా తెలుసుకునేందుకు సీఈఓ దీపింద‌ర్ గోయ‌ల్ డెలివ‌రీ బాయ్‌గా వెళ్లారు. ఆర్డర్‌ కలెక్ట్‌ చేసుకునేందుకు ఓ మాల్‌కు వెళ్లగా.. అక్కడ ఆయన్ని లిఫ్ట్‌లోకి అనుమతించలేదు. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి గోయల్ ఎక్స్ వేదికగా తెలిపారు. దాంతో చేసేదేమిలేక మెట్ల మార్గంలోనే మూడో అంత‌స్తుకు వెళ్లి ఆర్డ‌ర్ తీసుకున్న‌ట్లు త‌న‌కు ఎదురైన షాకింగ్‌ అనుభ‌వాన్ని తెలియ‌జేశారు. ఈ సంఘ‌ట‌న‌తో డెలివ‌రీ బాయ్స్ సంక్షేమం దృష్ట్యా మాల్స్‌తో క‌లిసి జొమాటో మ‌రింత సాన్నిహిత్యంగా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విషయం త‌న‌కు బోద‌ప‌డింద‌ని అన్నారు.

దీనిపై మీరేమ‌నుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియ‌జేయ‌డంటూ నెటిజ‌న్లను కోరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.పని సమయంలో డెలివరీ పార్టనర్ల పరిస్థితులు మెరుగుపర్చడం కోసం మాల్స్‌ యాజమాన్యంతో మరింత కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు చెప్పుకొచ్చారు. మాల్స్‌ యాజమాన్యాలు కూడా డెలివరీ ఏజెంట్ల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    
Advertisement

Similar News