6 నెలలుగా జీతాలివ్వడంలేదని పిర్యాదు చేసిన‌ వ్యక్తిని నడుం విరగ్గొడతానని హెచ్చరించిన మంత్రి

''ఇది ప్రభుత్వ సమావేశం. దీనికి అంతరాయం కలిగించే వారి నడుమును పోలీసులచే విరిగ్గొట్టిస్తాను. ఈ కార్యక్రమాన్ని చెడగొట్టేందుకు కాంగ్రెస్‌ నేత నీకు ఎంత ఇచ్చారు?'' " అని మధ్యప్రదేశ్ అటవీ శాఖ మంత్రి విజయ్ షా ప్రశ్నించారు.

Advertisement
Update:2023-02-15 17:05 IST

మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లాలోని గోల్ఖెడా ప్రాంతంలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి విజయ్ షా పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఓ వ్యక్తి లేచి తన భార్య అంగన్‌వాడీ కేంద్రంలో పని చేస్తున్నదని, ఆమెకు ఆరు నెలలుగా జీతాలు అందడం లేదని తెలిపాడు. దయచేసి జీతాలు వచ్చేట్టు చూడాలని ఆ వ్యక్తి మంత్రిని కోరాడు. దాంతో మంత్రి విజయ్ షా కు కోపం ముంచుకొచ్చింది. ఈ సమావేశాన్ని చెడగొట్టడానికి వచ్చావా ? నీ నడుం విరగ్గొట్టిసానని ఆ వ్యక్తిని హెచ్చరించాడు.

సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోలో, ప్రశ్నించిన వ్యక్తిని మందు తాగించి కాంగ్రెస్ పార్టీ పంపిందని మంత్రి ఆరోపించారు.

"మేము మధ్యప్రదేశ్‌లో అభివృద్ధి శకానికి నాంది పలుకుతున్నాం. అయితే ఇక్కడ సీన్ క్రియేట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అరెస్ట్ చేస్తాం. ఇది ప్రభుత్వ సమావేశం. దీనికి అంతరాయం కలిగించే వారి నడుమును పోలీసులచే విరిగ్గొట్టిస్తాను. ఈ కార్యక్రమాన్ని చెడగొట్టేందుకు కాంగ్రెస్‌ నేత నీకు ఎంత ఇచ్చారు?'' " అని షా ప్రశ్నించారు..

స్థానిక కాంగ్రెస్ నాయకుడిని ఉద్దేశించి షా, "నాకు తెలుసు, అతను మద్యం తాగించి ప్రజలను రెచ్చగొట్టి నామీదికి పంపుతాడు." అని పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న విషయం తనకు తెలుసని, మద్యం అమ్ముతున్న వ్యక్తులను పట్టుకోవాలని అక్కడున్న పోలీసులను ఆయన ఆదేశించారు విజయ్ షా.

Tags:    
Advertisement

Similar News