బీజేపీకి వ్య‌తిరేకంగా ఓ కుటుంబంలా పోరాడుతాం.. - మ‌మ‌తా బెన‌ర్జీ

2024 లోక్‌స‌భ‌ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా సుమారు 20 ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు, సీఎంలు శుక్రవారం పట్నాలో భేటీ అవుతున్నారు.

Advertisement
Update:2023-06-23 07:49 IST

కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాల‌న్నీ క‌లిసి ఒక కుటుంబంలా పోరాడ‌తామ‌ని ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. శుక్రవారం జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశం కోసం గురువారం సాయంత్రం మమతా బెన‌ర్జీ పట్నాకు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్ష పార్టీల స‌మావేశంలో ఏం జ‌రుగుతుంద‌నేది తాను చెప్ప‌లేన‌ని, కానీ బీజేపీకి వ్య‌తిరేకంగా అంతా క‌లిసిక‌ట్టుగా పోరాడేందుకే ఇక్క‌డ స‌మావేశ‌మ‌వుతున్నామ‌ని వివ‌రించారు.

దేశాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలి...

దేశాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలన్న మమత.. మణిపూర్‌లో హింసపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో శనివారం జరగబోయే అఖిలపక్ష భేటీకి హాజరుకావడం లేదని స్ప‌ష్టం చేశారు. 2024 లోక్‌స‌భ‌ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా సుమారు 20 ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు, సీఎంలు శుక్రవారం పట్నాలో భేటీ అవుతున్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ భేటీని ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ సహా వివిధ రాష్ట్రాల్లోని పార్టీల అధ్యక్షులు, సీఎంలతో సమావేశమైన సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News