కండోమ్‌లు కూడా ఫ్రీగా కావాలంటారేమో..?

ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక మహిళా అధికారి అయి ఉండి విద్యార్థినులను ఇలా కించపరుస్తారా అంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.

Advertisement
Update:2022-09-29 08:38 IST

నెలసరి గురించి, శానిటరీ న్యాప్‌కిన్స్‌ గురించి విద్యార్థినులు అంత చొరవగా మాట్లాడే పరిస్థితి ఇంకా భారత్‌లో లేదు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఆడపిల్లలు అంత ధైర్యంగా తమ ఇబ్బందులు చెప్పుకుంటారని కూడా అనుకోలేం. కానీ ఆ అమ్మాయిలు తమకు శానిటరీ న్యాప్‌కిన్స్‌ ఉచితంగా ప్రభుత్వం తరపున ఇప్పించే ప్రయత్నం చేయాలని కోరారు. రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారిణి హర్ జోత్ కౌర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రశ్నకు ఆ ఐఏఎస్ అధికారిణి ఇచ్చిన సమాధానం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆడ పిల్లలకు అండగా ఉండాల్సిన ఆవిడే.. వారిని చెడామడా తిట్టేసింది. నీఛంగా మాట్లాడింది.

"అన్నీ ఫ్రీగా కావాలంటారా.. మీ కోరికలకు హద్దే ఉండదు. ప్రభుత్వం ఇస్తే ఉచితంగా జీన్స్ ఫ్యాంట్లు, అందమైన షూ కూడా అడిగేలా ఉన్నారు.. చివరకు కండోమ్‌లు కూడా ఉచితంగా అడుగుతారేమో" అంటూ విద్యార్థినులపై మండిపడ్డారు హర్ జోత్ కౌర్. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక మహిళా అధికారి అయి ఉండి విద్యార్థినులను ఇలా కించపరుస్తారా అంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం..

ప్రభుత్వ అధికారులెవరైనా విద్యార్థులతో సమావేశమైతే ఓటు హక్కు విలువ గురించి చెబుతారు. ఓటు హక్కు కచ్చితంగా వినియోగించుకోవాలని సూచిస్తారు. కానీ ఇక్కడ హర్ జోత్ కౌర్ మాత్రం ఓటు వేయడం మానేయండి అంటూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా మాట్లాడారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తారు కదా, ప్రభుత్వాన్ని శానిటరీ న్యాప్‌కిన్స్‌ ఉచితంగా అడిగే తప్పేంటని విద్యార్థినులు ఆమెను అడిగారు. "పాకిస్థాన్‌లో మీరు ఓట్లు వేయకండి" అంటూ ఆమె బదులిచ్చారు. దీంతో విద్యార్థులు షాకయ్యారు. విద్యార్థినులతో హర్ జోత్ కౌర్ సంభాషణల‌ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News