ఈరోజు విచారణ పూర్తి... 10 గంటలపాటు కవితను విచారించిన ఈడీ అధికారులు

ఈ రోజు కవిత తనతో పాటు తన ఫోన్లను తీసుకెళ్ళి ఈడీకి స్వాధీనం చేశారు. ఇప్పటి వరకు ఆ ఫోన్లను కవిత ధ్వంసం చేశారనే ప్రచారాల నేపథ్యంలో ఆమె ఆ ఫోన్లను ఈడీ అధికారులకు ఇవ్వడమే కాక , తనపై జరిగిన అబద్దపు ప్రచారాలపై మండిపడ్డారు.

Advertisement
Update:2023-03-21 22:19 IST

ఢిల్లీ మద్యం కేసులో ఈ రోజు ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 10 గంటల పాటు ప్రశ్నించారు. ఈరోజు ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు.

ఈ రోజు కవిత తనతో పాటు తన ఫోన్లను తీసుకెళ్ళి ఈడీకి స్వాధీనం చేశారు. ఇప్పటి వరకు ఆ ఫోన్లను కవిత ధ్వంసం చేశారనే ప్రచారాల నేపథ్యంలో ఆమె ఆ ఫోన్లను ఈడీ అధికారులకు ఇవ్వడమే కాక , తనపై జరిగిన అబద్దపు ప్రచారాలపై మండిపడ్డారు.

ఈ రోజు ఉదయం ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి కవిత ఈడీ కార్యాలయానికి బయలు దేరేప్పుడు మీడియాకు 9 మొబైల్ ఫోన్లను చూపించారు. ఆ తర్వాత ఈడీ కార్యాలయం దగ్గర కూడా మరోసారి మీడియాకు సీల్డ్ కవర్‌లో ఉన్న ఫోన్లను కవిత చూపించారు. అనంతరం ఆమె ఈడీ కార్యాలయంలోకి వెళ్ళిపోయారు. ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయంలోకి వెళ్ళిన కవిత రాత్రి9.30 గంటలు దాటినా బయటికి రాకపోవడంతో ఈడీ కార్యాలయంలో అసలేం జరుగుతోందో అర్థం కాక బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. చివరికి 9.30 గంటల ప్రాంతంలో కవిత బయటికి రావడంతో బీఆర్ఎస్ క్యాడర్ ఊపిరి పీల్చుకున్నారు. .

అయితే, మళ్ళీ విచారణ ఎప్పుడు ఉంటుంది అనే విషయం తాము మెయిల్ చేస్తామని ఈడీ అధికారులు కవితకు చెప్పినట్టు సమాచారం.

Tags:    
Advertisement

Similar News