యూపీ మదర్సా చట్టం రాజ్యాంగబద్ధమే

గతంలో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేత.. ఈ చట్టాన్ని సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం

Advertisement
Update:2024-11-05 12:59 IST

యూపీలో వేల సంఖ్యలో ఉన్న మదర్సాలకు భారీ ఊరట దక్కింది. ఉత్తర్‌ప్రదేశ్‌ మదర్సా ఎడ్యుకేషన్‌ చట్టం రాజ్యాంగబద్ధమేనని మంగళవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ చట్టాన్ని సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం.. గతంలో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.

యూపీ మదర్సా చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ గతంలో అలహాబాద్‌ హైకోర్టు దాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అది లౌకికవాద భావనకు విరుద్ధమైనదని ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీంతో ఆ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని తెలిపింది. ఈ తీర్పు10 వేల మదర్సా టీచర్లు, 17 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపైనా ప్రభావం చూపిస్తుందని అప్పట్లో పేర్కొన్నది. ప్రస్తుతం సుప్రీం తీర్పుతో 16 వేల మదర్సాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి. 

Tags:    
Advertisement

Similar News