టీసీఎస్ గుడ్‌న్యూస్.. ఆఫర్ లెటర్ ఇచ్చినవాళ్లందరికీ ఉద్యోగాలు
ఈ ఆర్థిక సంవత్సరంలో 10వేల మంది ఫ్రెషర్లను నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేయడానికి టీసీఎస్ ఏర్పాట్లు చేసింది. ఎన్‌క్యూటీ ద్వారా ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు కృతివాసన్ చెప్పారు.
ఐటీ జాబ్స్ మార్కెట్‌లో అనిశ్చితి ఉందన్న వార్తలతో టెన్షన్‌గా ఉన్న ఫ్రెషర్లకు టీసీఎస్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ 40వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంటామని టీసీఎస్ సీఈఓ, ఎండీ కృతివాసన్ స్పష్టం చేశారు. ఇప్పటికే కాలేజ్‌ల్లో క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ చేసి, ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారందరికీ ఉద్యోగాలిస్తామని గ్యారంటీ ఇచ్చేశారు.
ఎన్‌క్యూటీ ద్వారా 10 వేల మంది సెలక్షన్
ఈ ఆర్థిక సంవత్సరంలో 10వేల మంది ఫ్రెషర్లను నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేయడానికి టీసీఎస్ ఏర్పాట్లు చేసింది. ఎన్‌క్యూటీ ద్వారా ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు కృతివాసన్ చెప్పారు.
శుభసంకేతమేనా?
కరోనా సమయంలో భారీగా ప్రాజెక్టులతో ఐటీ కంపెనీలు కొత్తగా వేలమందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. 2022 తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఐటీ కంపెనీలు నెమ్మదిగా ఉద్యోగులను తగ్గించుకోవడం మొదలుపెట్టాయి. కొత్త జాబ్‌ల మార్కెట్‌పైనా ఇది ప్రభావం చూపింది. అయితే ఈ ఏడాది ఆ ట్రెండ్ మారుతుందని, కొత్తగా 8-14% వరకు ఉద్యోగాలు రావచ్చని అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్ ఎండీ చెప్పడం శుభసూచకంగానే కనిపిస్తోంది.