ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్.. వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు
ఇవాళ ఉదయం ఆమె బరువు పెరిగినట్లు గుర్తించిన ఒలింపిక్స్ కమిటీ ఆమెపై వేటు వేసినట్లు తెలుస్తోంది. భారత అధికారులు విజ్ఞప్తి చేసినప్పటికీ ఒలింపిక్స్ కమిటీ అంగీకరించలేదని సమాచారం.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రెజ్లింగ్ విభాగంలో పతకం సాధిస్తుందనుకున్న వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో పోటీ పడుతున్న వినేష్ ఫోగట్.. ఇవాళ రాత్రి ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే నిర్దేశిత 50 కేజీల బరువు కన్నా 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హత వేటు పడినట్లు తెలుస్తోంది.
సాధారణంగా వినేష్ ఫోగట్ 53 కేజీల విభాగంలో పోటీ పడుతుంది. అయితే ఈ ఒలింపిక్స్ కోసం ఆమె బరువును 50 కేజీలకు తగ్గించుకుంది. ఇవాళ ఉదయం ఆమె బరువు పెరిగినట్లు గుర్తించిన ఒలింపిక్స్ కమిటీ ఆమెపై వేటు వేసినట్లు తెలుస్తోంది. భారత అధికారులు విజ్ఞప్తి చేసినప్పటికీ ఒలింపిక్స్ కమిటీ అంగీకరించలేదని సమాచారం.
ఒలింపిక్స్ గేమ్స్ రెజ్లింగ్ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా వినేష్ రికార్డుల కెక్కింది. తొలి బౌట్‌లోనే అత్యంత కఠినమైన ప్రత్యర్థిని ఎదుర్కొని గెలిచింది. అంతర్జాతీయ కెరీర్‌లో ఓటమి ఎరుగని జపనీస్ రెజ్లర్, నాలుగు సార్లు ఒలింపిక్స్ ఛాంపియన్‌గా నిలిచిన యుయి సుసాకిని ఫోగట్ మట్టికరిపించింది. అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. తానొకటి తలిస్తే విధి మరొకటి తలచినట్లు ఆమెపై ఊహించని రీతిలో వేటు పడింది. ఫైనల్‌కు చేరడంతో గెలిస్తే గోల్డ్ మెడల్, ఓడితే సిల్వర్ మెడల్ వస్తుందని అంతా భావించారు. అయితే ఇప్పుడు బరువు కారణంగా అనర్హత వేటు పడడంతో ఆమెకు ఎలాంటి పతకం రాదని, ఖాళీ చేతులతో ఇండియాకు తిరిగిరావాల్సి ఉంటుందని సమాచారం.