గర్భం దాల్చిన కుక్క... విచారణకు ఆదేశించిన అధికారులు

మేఘాలయలో భారత్, బాంగ్లేదేశ్ సరిహద్దుల్లో ఉన్న సరిహద్దు భద్రతా దళం (BSF) తో పాటు డ్యూటీ నిర్వహించే స్నిఫర్ డాగ్‌లలో ఒకటైన లాల్సీ మూడు కుక్కపిల్లలకు జన్మనిచ్చింది. దాంతో ఆర్మీ అధికారులు విచారణ కోసం డిప్యూటీ కమాండెంట్ ర్యాంక్ అధికారినినియమించారు.

Advertisement
Update:2023-01-01 11:57 IST

కుక్క గర్భం దాలిస్తే విచారణకు ఆదేశాలివ్వడమేంటని ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇదినిజం. ఓ కుక్క గర్భం దాల్చడమే కాక మూడు పిల్లలకు జన్మనివ్వడంతో అధికారులు షాక్ కు గురయ్యారు. దాంతో ఆ కుక్క గర్భందాల్చడానికి దారి తీసిన పరిస్థితులను పరిశోధించాలని విచారణకు ఆదేశించారు.

మేఘాలయలో భారత్, బాంగ్లేదేశ్ సరిహద్దుల్లో ఉన్న సరిహద్దు భద్రతా దళం (BSF) తో పాటు డ్యూటీ నిర్వహించే స్నిఫర్ డాగ్‌లలో ఒకటైన లాల్సీ మూడు కుక్కపిల్లలకు జన్మనిచ్చింది. దాంతో ఆర్మీ అధికారులు విచారణ కోసం డిప్యూటీ కమాండెంట్ ర్యాంక్ అధికారినినియమించారు.

డిసెంబర్ 19న షిల్లాంగ్ లోని BSF స్టేషన్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయం ఇచ్చిన‌ ఆర్డర్ కాపీ ప్రకారం...డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు బోర్డర్ అవుట్ పోస్ట్ బాగ్మారా వద్ద స్నిఫర్ డాగ్‌ మూడు కుక్కపిల్లలను కన్నది.యూనిట్‌లోని డిప్యూటీ కమాండెంట్ ఒక సమ్మరీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ (SCOI)ని నిర్వహించి ఆడ కుక్క లాల్సీ గర్భం ధరించిన‌ పరిస్థితులను పరిశోధిస్తారు.

ఉన్నత శిక్షణ పొందిన BSF కుక్కలను వాటి హ్యాండ్లర్ల పర్యవేక్షణలో ఉంచుతామని, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయిస్తామని సీనియర్ BSF అధికారి తెలియజేశారు. "ఈ కుక్కలు ఎప్పుడూ ఇతర కుక్కలతో సంబంధంలోకి వెళ్ళకుండా చూసుకుంటాము.'' అని ఆ అధికారి తెలిపారు.

ఆర్మీ నిబంధనల ప్రకారం.. బీఎస్ఎఫ్ క్యాంప్, బార్డర్ పెట్రోలింగ్ సహా సరిహద్దుల దగ్గర విధుల్లో నియమించిన శునకాలను నిర్దేశిత ప్రాంతం నుంచి బయటకు వెళ్లేందుకు అధికారులు అనుమతించరు. ఆయా ప్రదేశాల్లో పటిష్టమైన సెక్యూరిటీ ఉంటుంది. బయటి నుంచి ఎలాంటి జంతువులు లోనికి అడుగుపెట్టే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో స్నిఫర్ డాగ్ లాల్సీ గర్భం ఎలా దాల్చిందనేది అధికారులకు అర్దం కావడం లేదు. పైగా రెగ్యులర్ గా చేసే హెల్త్ చెకప్ ల సమయంలో కూడా ఈ విషయం బైటప‌డకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందంటున్నారు అధికారులు.

Tags:    
Advertisement

Similar News