ముంబైలో కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన నటి రకుల్‌ప్రీత్ సింగ్
ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో రకుల్‌ప్రీత్ సింగ్ తన భర్త జాకీ భగ్నానీతో కలిసి ఓటు వేశారు.
మహారాష్ట్ర, ఝర్ఖండ్ రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పుంజుకుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు 47.9% మహారాష్ట్రలో 32.18% ఓటింగ్ నమోదైంది. బాలీవుడ్ నటి రకుల్‌ప్రీత్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆమె తన భర్త జాకీ భగ్నానీతో కలిసి ఓటు వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నటి రకుల్‌ప్రీత్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆమె తన భర్త జాకీ భగ్నానీతో కలిసి ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం రకుల్ దంపతులు మీడియాతో మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు వేయడమని భాద్యత అని రకుల్ దంపతులు అన్నారు. ఓటు వేయకుండా ఇంట్లో కూర్చుని ప్రభుత్వాలపై మాటిమాటికి ఫిర్యాదులు చేయడం కరెక్టు కాదని చెప్పారు. ఓటు వేసిన వారికే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాట్లు చాలా బాగున్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేసి వచ్చేలా అవకాశాలు కల్పించారని రకుల్ దంపతులు చెప్పారు. కాగా మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ జరుగుతున్నది. ఈ నెల 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు