మేనిఫెస్టోల్లో ఇచ్చే హామీలు అవినీతి కిందకురావు
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక సహాయం చేశాయని, ఇది అవినీతి ఎన్నికల ఆచరణకు సమానమని పిటిషనర్ ఆరోపించారు.
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల్లో ఇచ్చే హామీలు అవినీతి కిందకు రావని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ వీకే విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ చేపట్టింది. హామీలు ఇవ్వడం అంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓటర్లకు ఆర్థిక సాయం చేసినట్లే అవుతుందని, ఇది అవినీతేనని పిటిషనర్ చేసిన వాదనతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించలేదు.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక సహాయం చేశాయని, ఇది అవినీతి ఎన్నికల ఆచరణకు సమానమని పిటిషనర్ ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీలు అవినీతి కిందకే వస్తాయని, అందుకే ఆ పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థిని పక్కన పెట్టాలని ఒక ఓటరు స్థానిక హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్ వాదన వింతగా ఉందని చెప్పింది. చెప్పిన పథకాల అమలు రాష్ట్ర ఖజానా దివాళా తీయడానికి ఎలా సమానమో ఇతర పార్టీలు చూపించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం తెలిపింది.