బీజేపీ నురుగు మాత్రమే, అస‌లు కాఫీ ఆర్ఎస్ఎస్‌- ప్రశాంత్ కిషోర్

బీహార్ సీఎం నితీష్ కుమార్ ముమ్మాటికి బీజేపీ ఏజెంటే అని పీకే ఆరోపించారు. నితీష్ గెలుపు కోసం కాకుండా కాంగ్రెస్‌ పునరుజ్జీవం కలిగించడానికి తాను పనిచేసి ఉండాల్సిందని పీకే వ్యాఖ్యానించారు.

Advertisement
Update:2022-10-31 07:11 IST

మహాత్మా గాంధీ కాంగ్రెస్‌కు పునరుజ్జీవం కలిగించడం ద్వారానే ఈ దేశంలో గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించడం సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. బీజేపీని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఆ పార్టీని ఓడించడం అంత ఈజీ కాదన్నారు.

కాఫీ కప్పులో పైన ఉండే నురుగు మాత్రమే బీజేపీ అని, అసలైన కాఫీ ఆర్‌ఎస్‌ఎస్‌ అని పీకే అభిప్రాయపడ్డారు. సంఘ్‌ ప్రస్తుత సమాజంలోకి చొచ్చుకెళ్లిందని దాన్ని ఓడించడానికి దగ్గరి దారులు ఏమీ లేవని.. గాంధీ కాంగ్రెస్‌కు పునరుజ్జీవం కలిగించడం ద్వారానే దాన్ని ఓడించడం సాధ్యమని చెప్పారు. ఈ విషయాన్ని గ్రహించడానికి తనకు చాలాకాలం పట్టిందన్నారు.

బీహార్ సీఎం నితీష్ కుమార్ ముమ్మాటికి బీజేపీ ఏజెంటే అని పీకే ఆరోపించారు. నితీష్ గెలుపు కోసం కాకుండా కాంగ్రెస్‌ పునరుజ్జీవం కలిగించడానికి తాను పనిచేసి ఉండాల్సిందని పీకే వ్యాఖ్యానించారు.

పౌరసత్య చట్ట సవరణకు మద్దతు ఇవ్వబోమని నితీష్ చెప్పారని.. కానీ జేడీయూ ఎంపీలంతా పార్లమెంట్‌లో బిల్లుకు మద్దతుగా ఓటేశారని.. దాంతో బాధపడి నితీష్‌తో గొడవ పెట్టుకున్నానని వివరించారు. ఎంపీలు అలా ఓటేసే విషయం తనకు తెలియదంటూ నితీష్ దాటవేశారని ఆ తర్వాత.. బీహార్‌లో ఎన్ఆర్‌సీకి అనుమతి ఇచ్చారని ఇలా రెండు నాల్కుల ధోరణితో వ్యవహరించే నితీష్‌తో ఉండడం సరికాదనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని పీకే వివరించారు. బీహార్‌లో 3500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న పీకే చంపారన్ జిల్లాలో మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    
Advertisement

Similar News