అంత్యక్రియల్లో మన్మోహన్‌ను కేంద్రం అవమానించింది : రాహుల్ గాంధీ

మన్మోహన్ సింగ్ ను బీజేపీ ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

Advertisement
Update:2024-12-28 17:50 IST

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను అంత్యక్రియల సందర్బంగా బీజేపీ ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఇప్పటి వరుకు దేశంలో మాజీ ప్రధానులందరి అంత్యక్రియలను అధికారిక శ్మశానావాటికలో నిర్వహించారు. కానీ మన్మోహన్ చివరి కార్యక్రమాలు నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరిపి అవమానించారని ప్రతిపక్ష నేత ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేశారు. మన్మోహన్ సింగ్‌‌కు మెమోరిల్ ఏర్పాటు చేసి, ఆయనపై గౌరవాన్ని చాటుకోవాలని ప్రధాని మోదీకి రాహుల్ సూచించారు.

డా. మన్మోహన్ సింగ్ మన అత్యున్నత గౌరవం, స్మారకానికి అర్హుడని, దేశం గర్వించదగ్గ ఈ మహాపుత్రుడికి, ఆయన సమాజానికి ప్రభుత్వం గౌరవం చూపించి ఉండాల్సిందని రాహుల్ గాంధీ ట్వీట్టర్‌లో రాసుకొచ్చారు. అలాగే ఆయన ఒక దశాబ్దం పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడని, ఆయన పదవీకాలంలో దేశం ఆర్థికంగా సూపర్ పవర్‌గా మారిందని, ఆయన విధానాలు ఇప్పటికీ దేశంలోని పేద, వెనుకబడిన తరగతులకు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు. ఇక ఇప్పటి వరకు మాజీ ప్రధానులందరి గౌరవిస్తూ.. వారి అంతిమ సంస్కారాలు అధికారిక శ్మశానవాటికలో నిర్వహించబడ్డాయని తద్వారా ప్రతి వ్యక్తి ఎటువంటి అసౌకర్యం లేకుండా చివరి చూపు చూసి, నివాళులు అర్పించారని రాహుల్ అన్నారు.

Tags:    
Advertisement

Similar News