భారత అటార్నీ జనరల్ పదవిని చేపట్టేందుకు ముకుల్ రోహ‌త్గీ విముఖం!

భారత అటార్నీ జనరల్‌గా మ‌ళ్ళీ ముకుల్ రోహ‌త్గీ నియమితులవుతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ పదవి చేపట్టడానికి ఆయన విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement
Update: 2022-09-26 03:10 GMT

భారత అటార్నీ జనరల్‌గా మ‌ళ్ళీ బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని కేంద్రం చేసిన ప్రతిపాదనను సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తిరస్కరించినట్లు అభిజ్ఞ‌ వర్గాలు తెలిపాయి. 67 ఏళ్ల ముకుల్ రోహత్గీ జూన్ 2017లో అటార్నీ జనరల్ పదవి నుంచి వైదొలిగారు. ఆయ‌న స్థానంలో కేకే వేణుగోపాల్ బాధ్యతలు చేపట్టారు.

వేణుగోపాల్ పొడిగించిన పదవీకాలం ఈ నెలాఖ‌రు (సెప్టెంబర్ 30) తో ముగుస్తుంది. ఆయన ఐదేళ్లపాటు కేంద్రంలో ఉన్నత న్యాయాధికారిగా పనిచేశారు. ముకుల్ రోహత్గీని మళ్లీ అటార్నీ జనరల్‌గా నియమించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించగా, దానిని ఆయన ఆమోదించిన‌ట్టు న్యాయ వ‌ర్గాలు తెలిపాయి. దాని ప్ర‌కారం ఆయ‌న అక్టోబ‌ర్ 1వ తేదీన బాధ్య‌త‌లు చేప‌ట్టాల్సి ఉంది. కానీ తాజాగా ఆ బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు రోహ‌త్గీ విముఖంగా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ముకుల్ రోహ‌త్గీ ప‌లు హైప్రొఫైల్ కేసులు వాదించారు. గుజరాత్ అల్ల‌ర్ల కేసులో ప్రభుత్వం తరపున వాద‌న‌లు వినిపించారు. దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు, హైకోర్టులలో కీల‌క కేసులు వాదించారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్‌కు సంబంధించిన కేసును కూడా ఆయన వాదించారు. ఇటీవల, డ్రగ్స్-క్రూయిజ్ కేసులో అరెస్టయిన షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం వాదించిన బృందానికి రోహత్గీ నాయకత్వం వహించారు.

Tags:    
Advertisement

Similar News