తెలంగాణ సహా మూడు రాష్ట్రాల్లో నేడు,రేపు మోడీ పర్యటన... #GobackModi ట్విట్టర్ లో ట్రెండింగ్
ప్రధాని మూడు రాష్ట్రాల పర్యటన సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో ఆయనకు తీవ్ర స్థాయిలో నిరసనల దెబ్బ తగలనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో 'మోడీ గో బ్యాక్' హ్యాష్ ట్యాగ్ నెంబర్ 1 ట్రెండింగ్ లో ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 8-9 తేదీలలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఏప్రిల్ 8 ఉదయం 11:45 గంటలకు, ప్రధానమంత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని, సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. మధ్యాహ్నం 12:15 గంటలకు, హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. అక్కడ ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్‌లోని ఎయిమ్స్ బీబీనగర్‌కు శంకుస్థాపన చేస్తారు.
మధ్యాహ్నం 3 గంటలకు, ప్రధాని చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారు, చెన్నై విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఇతర రైల్వే ప్రాజెక్టులను కూడా జెండా ఊపి ప్రారంభిస్తారు. సాయంత్రం 4:45 గంటలకు చెన్నైలోని శ్రీరామకృష్ణ మఠం 125వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు.
సాయంత్రం 6:30 గంటలకు, చెన్నైలోని ఆల్‌స్ట్రోమ్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. అక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోడ్డు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.
ఏప్రిల్ 9 న ఉదయం 7:15 గంటలకు, ప్రధాని మోదీ బందీపూర్ టైగర్ రిజర్వ్‌ను సందర్శిస్తారు. ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని కూడా ఆయన సందర్శించనున్నారు. రాత్రి 11 గంటలకు, మైసూరులోని కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన ‘ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాల జ్ఞాపకార్థం’ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభిస్తారు.
ప్రధానిమూడు రాష్ట్రాల పర్యటన సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో ఆయనకు తీవ్ర స్థాయిలో నిరసనల దెబ్బ తగలనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో 'మోడీ గో బ్యాక్' హ్యాష్ ట్యాగ్ నెంబర్ 1 ట్రెండింగ్ లో ఉంది.
తెలంగాణలో మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. తెలంగాణకు మోడీ చేస్తున్న అన్యాయం, తెలంగాణ పట్ల చూపిస్తున్న వివక్ష, సింగరేణి ప్రవేటీకరణకు కుట్రలు, బీజేపీ నేతల కుటుంబ పాలన తదితర అంశాలపై హైదరాబాద్ నగరంలో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఆయనకు స్వాగతం పలకనున్నాయి.
ఇక తమిళనాడు కర్నాటకల్లో కూడా మోడీకి నిరసన సెగ బాగానే తగలనుంది. తమిళనాడులో అనేక చోట్ల నల్ల బెలూన్లు ఎగరేసి మోడీకి నిరసన తెలుపుతున్నారు.పలు ద్రవిడ సంఘాలు చెన్నైలో లక్ష నల్ల బెలూన్లు ఎగరేసి మోడీకి నిరసన తెలుపుతున్నాయి.
మరో వైపు ట్విట్టర్ లో గో బ్యాక్ మోడీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింలో ఉంది. మోడీపై నెటిజనులు దుమ్మెత్తి పోస్తున్నారు.
ట్విట్టర్ లో పలువురు నెటిజనులు చేస్తున్న కామెంట్లు....
"మీ జీవితకాలంలో మీరు తమిళనాడును ఎప్పటికీ పాలించలేరు." #GobackModi
వన్ నేషన్ వన్ ట్యాగ్ #GobackModi
మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ కంటే అధ్వాన్నంగా ఉన్నారు !!#GobackModi
అదానీ తొత్తు రాజీనామా చేసి ఈ దేశాన్ని రక్షించాల్సిన సమయం వచ్చింది. #GobackModi
కాగా, దక్షిణాదిలో నరేంద్ర మోడీ, బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నటికీ బీజేపీ, మోడీలు దక్షిణాది ప్రజల హృదయాలను గెలవలేరని, దక్షిణాదిని ఆక్రమించలేరని నెటిజనులు స్పష్టం చేస్తున్నారు.