నిగంబోధ్ ఘాట్ లో మన్మోహన్ అంత్యక్రియలు
రేపు ఉదయం 11.45 గంటలకు నిర్వహణ : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
Advertisement
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం ఉదయం 11.45 గంటలకు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. న్యూఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటనలో వెల్లడించారు. ఆయన అంతిమయాత్ర, అంత్యక్రియలకు సైనిక లాంఛనాలతో అన్ని ఏర్పాట్లు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖను ఆదేశించారు. మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం సమావేశమైన కేంద్ర కేబినెట్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తం చేసింది. ఆయన మృతికి ఏడు రోజుల పాటు సంతాపదినాలుగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
Advertisement