చైనా నిఘా బెలూన్ భారత గగనతలం పైనా సంచరించిందా...?
"కొంతకాలం క్రితం, మేము అండమాన్‌పై బెలూన్ వంటి తెల్లని వస్తువును చూశాము. ఆ వస్తువు అధిక-రిజల్యూషన్ చిత్రాలను, వీడియోలను అక్కడి ప్రజలు తీశారు" అని రక్షణ అధికారులు ఓ మీడియా సంస్థకు తెలిపారు.
అమెరికా గగనతలంపై ఎగిరిన చైనా బెలూన్లను అమెరికా కూల్చివేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చైనా బెలూన్లపై చర్చ సాగుతోంది. అవి నిఘా బెలూన్లని అమెరికా ప్రకటించింది. ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలపై నిఘా కోసం చైనా బెలూన్లను ప్రయోగించిందని అమెరికా తెలిపింది.
ఈ నేపథ్యంలో భారతదేశం గగనతలంపై కూడా సంవత్సరం క్రితం చైనా బెలూన్లు సంచరించాయని వార్తలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
అండమాన్, నికోబార్ దీవుల మీద ఆకాశంలో చైనా గూఢచారి బెలూన్‌ను పోలిన వస్తువులను భారత రక్షణ దళాలు ఒక సంవత్సరం క్రితం చూశాయని ఇప్పుడు బైటపడింది.
"కొంతకాలం క్రితం, మేము అండమాన్‌పై బెలూన్ వంటి తెల్లని వస్తువును చూశాము. ఆ వస్తువు అధిక-రిజల్యూషన్ చిత్రాలను, వీడియోలను అక్కడి ప్రజలు తీశారు" అని రక్షణ అధికారులు ఓ మీడియా సంస్థకు తెలిపారు.
అయితే, బెలూన్ ఎందుకొచ్చింది, దాని ఉద్దేశ్యంఏంటి అనే విషయాలపై స్పష్టత లేదు. అది మయన్మార్ నుండి వచ్చిందా లేక చైనా నుండి వచ్చిందా అనేది కూడా స్పష్టంగా తెలియలేదు. అయితే అది మూడు నాలుగు రోజుల తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయిందని వారు తెలిపారు.
ఆ సమయంలో, గాలుల కారణంగా పాకిస్తాన్ వైపు నుండి చాలా బెలూన్లు భారతదేశం వైపు రావడంతో ఇది వాతావరణ బెలూన్ అయి ఉండవచ్చని కూడా భావించినట్లు వారు తెలిపారు. ఆ బెలూన్లు రాడార్లను కూడా తప్పించుకున్నాయని వారువివరించారు.
అండమాన్ లేదా మరేదైనా ప్రాంతంలో మళ్లీ అలాంటి వస్తువు కనిపిస్తే, దానిని జాగ్రత్తగా అధ్యయనం చేసి, గూఢచర్య వస్తువుగా తేలితే, దానిని కిందికి దించడమో, పేల్చేయడమో చేస్తామని అధికారులు తెలిపారు.