UNO అ‍చనావేసిన సమయం కంటే ముందుగానే ఇండియా నెంబర్ 1 అయిపోయిందా ?

మన దేశ జనాభా 142.8 కోట్లకు చేరుకుందని పరిశోధన సంస్థ మాక్రో ట్రెండ్స్ అంచనా వేసింది. ఇదే సమయంలో చైనా జనాభా 141.2 కోట్లుగా ఉంది. దీన్ని బట్టి అప్పుడే మనం చైనా జనాభాను దాటిపోయి ప్రపంచంలోనే నెంబర్ 1 అయ్యామని డేటా చెప్తోంది.

Advertisement
Update:2023-01-19 08:59 IST

ఈ ఏడాది చివరినాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభాగల దేశంగా అవతరిస్తుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అయితే ఆ అంచనాలను తప్పు చేస్తూ మన దేశం అప్పుడే చైనా జనాభాను మించి పోయిందని వరల్డ్ పాపులేషన్ రివ్యూ (WPR) అంచనాలు చెప్తున్నాయి. గత ఏడాది డిశంబర్ నాటికే మన జనాభా141.7 కోట్లకు చేరుకుందని, ఆ స‍ంఖ్య నిన్నటికి 142.3 కోట్లకు చేరిందని WPR చెప్తోంది.

మరో పరిశోధన సంస్థ మాక్రో ట్రెండ్స్ కూడా మన దేశ జనాభా 142.8 కోట్లకు చేరుకుందని అంచనా వేసింది. ఇదే సమయంలో చైనా జనాభా 141.2 కోట్లుగా ఉంది. దీన్ని బట్టి అప్పుడే మనం చైనా జనాభాను దాటిపోయి ప్రపంచంలోనే నెంబర్ 1 అయ్యామని డేటా చెప్తోంది.

2023 డిశంబర్ నాటికి భారత్ ఈ రికార్డుకు చేరుకుంటుందని గత ఏడాది ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అయితే దానికి ముందే భారత్ ఆ అంచనాలను అదిగమించింది. 2050 నాటికి భారత దేశ జనాభా 167 కోట్లు అవుతుందని అంచనా.

ప్రపంచజనాభా కూడా 1974 కు ఇప్పటికి రెట్టింపయ్యింది. 1974 లో 400 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా ఇప్పుడు 800 కోట్లకు చేరుకుంది. ప్రపంచంలోని ఆరు దేశాలు మాత్రమే ప్రపంచ జనాభాను పెంచడంలో ముందున్నాయని ఐక్యరాజ్యసమితి రిపోర్ట్ చెప్తోంది. అందులో మన దేశంఅందరికన్నా ముందుభాగంలో ఉంది.

ప్రపంచం సాంకేతికంగా అభివృద్ది చెందడం, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవడం, మానవుని ఆయుర్దాయం పెరగడం, మరణాల రేటు తగ్గడం జనాభా పెరుగుదలకు కారుణాలుగా భావిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News