అప్పుడే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ కుమార్తెల్లో ఒకరు అమెరికా నుంచి రావాల్సి ఉండడంతో, ఆయన అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని నేడు ఢిల్లీలోని మోతిలాల్ నెహ్రూ రోడ్డులో నివాసంలో ఉంది ఆయనకు పూర్తిస్థాయి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మన్మోహన్ సింగ్ కుమార్తెల్లో ఒకరు అమెరికా నుంచి రావాల్సి ఉండడంతో, ఆయన అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నారు. ఆమె అమెరికాలో విమానం ఎక్కినట్టు తెలుస్తోంది. నేటి అర్ధరాత్రి తర్వాత భారత్ చేరుకుంటారని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ తెలిపారు.
ఇక, ప్రజల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి తరలించనున్నామని, అయితే దీనికి సంబంధించిన కార్యాచరణ మన్మోహన్ కుమార్తె వచ్చాక ఖరారు చేస్తారని తెలుస్తోంది. డిసెంబర్ 28 వ తేదీ ఉదయం 8 గంటలకు ఆయన పార్థివదేహాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించి ఉదయం 8.30లకు ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు నివాళులర్పించేందుకు అవకాశం ఉంటుంది. రేపు ఉదయం 9.30 గంటలకు మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని తెలుస్తోంది.