మాజీ జడ్డిలు వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమే : సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్

కేశవానంద భారతి కేసుకు సంబంధించి వచ్చిన ఒక పుస్తకం చదవిన తర్వాత తనకు రాజ్యాంగ మౌలిక స్వరూపంపై చర్చకు న్యాయపరమైన అవకాశం ఉందని గోగోయ్ అన్నారు.

Advertisement
Update:2023-08-09 10:01 IST

మాజీ జడ్జిలు చేసే వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే చూడాలి. వాటికి కట్టుబడాల్సిన అవసరం అసలు లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. 1971 నాటి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి సీజేఐ చంద్రచూడ్ ఈ మేరకు స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్యాంగ మౌలిక స్వరూపంపై మాజీ సీజేఐ, ప్రస్తుత ఎంపీ రంజన్ గొగోయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేశవానంద భారతి కేసుకు సంబంధించి వచ్చిన ఒక పుస్తకం చదవిన తర్వాత రాజ్యాంగ మౌలిక స్వరూపంపై చర్చకు న్యాయపరమైన అవకాశం ఉందని తనకు అనిపించిందని గోగోయ్ అన్నారు.

మాజీ సొలిసిటర్ జనరల్ అంధ్యారుజిన ఆ పుస్తకం రాశారని.. అందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇక ఇంతకు మించి తానేమీ మాట్లాడను అంటూ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన కేసులో మంగళవారం నేషనల్ కాన్ఫరెన్స్ నేత మహ్మద్ అక్బర్ తరపున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసిన తీరు ఏ విధంగానూ సమర్థనీయం కాదన్నారు.

మెజార్టీ ఉన్నంత మాత్రాన ఏదైనా చేయవచ్చనే న్యాయసూత్రం అమల్లో ఉంటే తప్ప.. ఆర్టికల్ 370ని రద్దు చేయడం సరి కాదని కపిల్ సిబాల్ ధర్మాసనానికి చెప్పారు. రాజ్యాంగ మౌలిక స్వరూపంపై ఇటీవల మీ కొలీగ్ ఒకరు ప‌లు సందేహాలు లేవనెత్తారంటూ రంజన్ గొగోయ్ వ్యాఖ్యలను సిబాల్ ఉటంకించారు. దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందిస్తూ.. కొలీగ్ అంటే ఇప్పుడు మాతో పాటు ఉన్న సిట్టింగ్ జడ్జిలే. వాళ్లనే కొలీగ్స్ అంటారు. ఒక సారి బాధ్యతల నుంచి దిగిపోయిన తర్వాత.. మేం ఏం మాట్లాడినా అది వ్యక్తిగత అభిప్రాయమే. దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News