ఇన్ఫోసిస్‌పై విమర్శలు.. సీఈవో స్పందన ఇదే

2022–23 రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో భాగంగా 2వేల మంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను పలు ఉద్యోగాలకు ఎంపిక చేసి ఆఫర్‌ లెటర్లు ఇచ్చిన ఇన్ఫోసిస్‌ సంస్థ.. ఆ తర్వాత వారిని విధుల్లోకి తీసుకోలేదు.

Advertisement
Update:2024-08-26 19:15 IST

ఆఫర్‌ లెటర్లు ఇచ్చినా ఉద్యోగ నియామకాల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై ప్రముఖ టెక్‌ సంస్థ ఇన్ఫోసిస్‌పై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కంపెనీ సీఈవో సలీల్‌ పరేఖ్‌ తాజాగా స్పందించారు. తమ కంపెనీ నుంచి ఆఫర్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఉద్యోగాల్లో చేరుతారని ఆయన వెల్లడించారు. తాము ఇచ్చిన ప్రతి ఆఫర్‌ తమ పరిగణనలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆ ఆఫర్‌ దక్కించుకున్న ప్రతి ఒక్కరూ కంపెనీలో తప్పకుండా చేరుతారని తెలిపారు. కొన్ని కారణాల వల్ల తేదీలను మార్చొచ్చని.. వారిని ఉద్యోగంలోకి తీసుకోవడం మాత్రం గ్యారంటీ అని ఆయన తెలిపారు. అందులో ఎలాంటి మార్పూ ఉండదని తేల్చిచెప్పారు.

రెండేళ్ల క్రితం నియామ‌కాలు చేపట్టి 2000 మందిని ఎంపిక చేసినా ఇప్పటికీ వారిని విధుల్లోకి తీసుకోకపోవడంతో ఇన్ఫోసిస్‌పై గత కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2022–23 రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో భాగంగా 2వేల మంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను పలు ఉద్యోగాలకు ఎంపిక చేసి ఆఫర్‌ లెటర్లు ఇచ్చిన ఇన్ఫోసిస్‌ సంస్థ.. ఆ తర్వాత వారిని విధుల్లోకి తీసుకోలేదు. వీరందరూ 2022 ఏప్రిల్‌లోనే ఉద్యోగాల్లో చేరాల్సి ఉండగా ఆన్‌బోర్డింగ్‌ ప్రాసెస్‌ను కంపెనీ పలుమార్లు వాయిదా వేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇటీవల ఐటీ, ఐటీఈఎస్‌ యూనియన్‌ నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌ కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ సీఈవో దీనిపై స్పందించారు.

Tags:    
Advertisement

Similar News