ఎగ్జిట్ పోల్స్ : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దుమ్మురేపబోతున్న‌ ఆమ్ ఆద్మీ పార్టీ

15 ఏళ్ళుగా ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ పీఠాన్ని గెలుస్తూ వస్తున్న బీజేపీకి ఈ సారి పెద్ద దెబ్బ తగలనుందని ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆప్ ఈ ఎన్నికల్లో దుమ్ము రేపనుందని అర్దమవుతోంది.

Advertisement
Update:2022-12-05 19:14 IST

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ను ఆమ్ ఆద్మీ పార్టీ ద‌క్కించుకోనున్నదని వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. రెండవ స్థానంతో బీజేపీ, మూడవ స్థానంతో కాంగ్రెస్ లు సరిపెట్టుకోనున్నాయి.

ఆజ్ తక్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ 2022 MCD ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ క్లీన్ స్వీప్ చేయబోతోంది.బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతుందని అంచనా.

మొత్తం 250 వార్డులకు గాను

ఆప్: 149-171 వార్డులు

బిజెపి: 61-91 వార్డులు

కాంగ్రెస్: 3-7 వార్డులు గెలవనున్నాయని అంచనా

ఇక టైమ్స్ నౌ-ETG ఎగ్జిట్ పోల్

ఆప్: 146-156 వార్డులు

బీజేపీ: 84-94 సీట్లు

కాంగ్రెస్: 6-10 సీట్లు

ఇతరులు: 0-4 సీట్లు గెలవనున్నాయని అంచనా వేసింది.

మొత్తానికి 15 ఏళ్ళుగా ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ పీఠాన్ని గెలుస్తూ వస్తున్న బీజేపీకి ఈ సారి పెద్ద దెబ్బ తగలనుందని ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆప్ కు వచ్చే మెజార్టీ చూసినా ఆ పార్టీ ఈ ఎన్నికల్లో దుమ్ము రేపనుందని అర్దమవుతోంది.

MCD ఎన్నికలలో విజయం ఢిల్లీలో AAP స్థానాన్ని సుస్థిరం చేయడమే కాకుండా జాతీయ రాజకీయాల్లో BJP, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తీవ్రమైన పోటీదారుగా ఎదగాలనే కేజ్రీవాల్ ఆకాంక్షకు ఈ విజయం మరింత ఆజ్యం పోస్తుంది.

జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ వంటి 19 మంది కేంద్రమంత్రులు, ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా తమ అగ్రనేతలందరినీ ప్రచారంలో మోహరించినప్పటికీ బీజేపీ ఓడిపోవడం ఆ పార్టీకి ఊహించలేని ఎదురు దెబ్బే.

Tags:    
Advertisement

Similar News