మహారాష్ట్ర, జార్ఖండ్ ఓట్ల లెక్కింపు పై కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్

రెండు రాష్ట్రాలకు పరిశీలకుల నియామకం

Advertisement
Update:2024-11-22 18:49 IST

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర వ్యవహారాలు పర్యవేక్షించేందుకు పరిశీలకులను నియమించింది. రెండు రాష్ట్రాలకు పరిశీలకులను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన లో తెలిపారు. మహారాష్ట్ర పరిశీలకులుగా పార్టీ సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, భూపేష్ భగేల్, జి. పరమేశ్వర.. జార్ఖండ్ పరిశీలకులుగా తారీఖ్ అన్వర్, మల్లు భట్టి విక్రమార్క, కృష్ణ అల్లావురు ను నియమించారు.

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసింది. జార్ఖండ్ లో కూటమికి జేఎంఎం నాయకత్వం వహిస్తుండగా, మహారాష్ట్ర లో మహా వికాస్ అఘాడీకి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది. రెండు రాష్ట్రాల ఓటరు తీర్పుపై కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపే మొగ్గు చూపినా ప్రభుత్వ ఏర్పాటుకు ఏ చిన్న అవకాశాలను కూడా జారవిడుచుకోవద్దనే ప్రయత్నాల్లో హస్తం పార్టీ ఉంది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలు వస్తున్న దశలోనే గెలిచే అభ్యర్థులను క్యాంపులకు తరలించడం సహా అన్ని ప్రయత్నాలు చేసేందుకే పరిశీలకులను రంగంలోకి దించింది. అందరు పరిశీలకులు వెంటనే కేటాయించిన రాష్ట్రాలకు చేరుకొని పోలింగ్ తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెట్టాలని సూచించింది.

Tags:    
Advertisement

Similar News