ప్రజ్వల్ రేవణ్ణ కేసులో సీబీఐ ఎంట్రీ.. బ్లూ కార్నర్ నోటీసులు జారీ
సెక్స్ స్కాండల్ విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసులో సీబీఐ సాయం కోరింది. ప్రజ్వల్ రేవణ్ణ ఆచూకీ తెలుసుకునేందుకు హెల్ప్ చేయాలని విజ్ఞప్తి చేసింది.
కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులోకి సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. సెక్స్ స్కాండల్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ ఆచూకీ తెలుసుకునేందుకు సీబీఐ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ డిప్లోమాటిక్ పాస్‌పోర్టు ఉపయోగించి జర్మనీ వెళ్లారని ఇప్పటివరకూ ప్రచారం జరిగింది.
అయితే సెక్స్ స్కాండల్ విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసులో సీబీఐ సాయం కోరింది. ప్రజ్వల్ రేవణ్ణ ఆచూకీ తెలుసుకునేందుకు హెల్ప్ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తి మేరకు సీబీఐ ప్రజ్వల్ రేవణ్ణ ఆచూకీ తెలుసుకునేందుకు అంతర్జాతీయ పోలీసుల సాయం కోరుతూ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది.
ప్రజ్వల్ రేవణ్ణ కోసం ఇప్పటికే కర్ణాటక పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఓ మహిళను కిడ్నాప్ చేశారన్న కేసులో ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి, మాజీ మంత్రి H.D.రేవణ్ణను సిట్ శనివారం అరెస్టు చేసింది.