బీజేపీ ఎమ్మెల్యే చెప్పేవి శ్రీరంగ నీతులు.. చూసేవి పోర్న్ వీడియోలు

త్రిపుర బీజేపీ ఇప్పుడీ బూతు వీడియోలతో ఇరుకున పడింది. ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.

Advertisement
Update:2023-03-30 20:45 IST

అప్పట్లో కర్నాటక అసెంబ్లీలో బీజేపీ నేతలు లక్ష్మణ్ సవాడి, సీసీ పాటిల్, కృష్ణా పాలేమర్ సెల్ ఫోన్ లో బూతు వీడియోలు చూసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సరిగ్గా ఇప్పుడు మరో బీజేపీ ఎమ్మెల్యే ఇలాంటి బూతు వీడియోలతోనే వార్తల్లోకెక్కాడు. ఈ ఘటన త్రిపురలో జరిగింది. త్రిపుర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్ బూతు వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. అప్పుడు, ఇప్పుడు బీజేపీ నేతలే ఇలా టార్గెట్ కావడం, అదికూడా పవిత్రమైన అసెంబ్లీలో ఇలాంటి పాడుపనులు చేయడం సంచలనంగా మారింది.

త్రిపుర రాష్ట్రంలోని బగ్బాసా నియోజకవర్గ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్. 55 ఏళ్ల ఈ బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాల్లో కలకలం రేపారు. సెల్ ఫోన్లో బూతు వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కాడు. అసెంబ్లీలో అసభ్య వీడియోల బాగోతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో త్రిపురలో బీజేపీ పరువు పోయింది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మానిక్ సాహా సీఎంగా మరోసారి ఎన్నికయ్యారు. అయితే త్రిపుర బీజేపీ ఇప్పుడీ బూతు వీడియోలతో ఇరుకున పడింది. ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. బీజేపీ ఎమ్మెల్యే చేసిన పనిని అందరూ చీదరించుకుంటున్నారు. చెప్పేవి శ్రీరంగ నీతులు చూసేవి పోర్న్ వీడియోలంటూ మెసేజ్ లు పెడుతున్నారు.

బీజేపీ నేతలు నోరు తెలిస్తే హిందూ దేవుళ్ల పేర్లు చెబుతుంటారు. వారే తమకు ఆదర్శమని అంటుంటారు. అంతెందుకు ఇటీవల హీరోయిన్ తాప్సి లక్ష్మీదేవి హారాన్ని మెడలో ధరించి ర్యాంప్ వాక్ చేస్తేనే పెద్ద రచ్చ చేశారు, పోలీస్ కేసు పెట్టారు. మరిప్పుడు ఆ ఎమ్మెల్యే చేసిన పనికి ఏం సమాధాం చెబుతారంటున్నారు నెటిజన్లు. బీజేపీ పరువుని బజారుకీడ్చారు. 

Tags:    
Advertisement

Similar News