హర్యానాలో అనూహ్య ఫలితాలపై విశ్లేషిస్తున్నాం

ప్రజల హక్కులు, సామాజిక, ఆర్థిక న్యాయం, నిజం కోసం మా పోరాటం కొనసాగుతుంది. ప్రజా గళానన్ని మేం వినిపిస్తూనే ఉంటామన్న రాహుల్‌గాంధీ

Advertisement
Update:2024-10-09 12:59 IST

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు తప్పాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఈజీగా అధికారంలోకి రాబోతున్నదని అన్ని సర్వే సంస్థలు ప్రకటించాయి. కౌంటింగ్‌ ప్రారంభమయ్యాక ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే కాంగ్రెస్‌ వైపు హెడ్జ్‌ కనిపించింది. కానీ రెండు మూడు గంటల తర్వాత సీన్‌ మొత్తం మారిపోయింది. కాంగ్రెస్‌ ఓటమి పాలైన మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. హర్యానా ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైన తర్వాత అప్‌డేట్స్‌పై కాంగ్రెస్‌ నేతలు మీడియా ముందు, సోషల్‌ మీడియా వేదికగా ఈసీని తప్పుపట్టారు. కావాలనే అప్‌డేట్స్‌ ఫలితాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఫలితాల అనంతరమూ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ పరిణామాల వేళ హర్యానాలో హస్తం పార్టీ పరాజయంపై ఆపార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ఈ అనూహ్య ఫలితాను తాము విశ్లేషిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన పోస్ట్‌ చేశారు.

'జమ్ముకశ్మీర్‌ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ గెలుపు మన రాజ్యాంగం సాధించిన విజయం. ప్రజాస్వామ్య ఆత్మగౌరవానికి దక్కిన విజయం. ఇక హర్యానాలో అనూహ్య ఫలితాలపై మేం విశ్లేషణ చేపట్టాం. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. హర్యానాలో పార్టీ కోసం నిరంతరం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజల హక్కులు, సామాజిక, ఆర్థిక న్యాయం, నిజం కోసం మా పోరాటం కొనసాగుతుంది. ప్రజా గళానన్ని మేం వినిపిస్తూనే ఉంటాం' అని రాహుల్‌ రాసుకొచ్చారు.

హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్‌ కొట్టింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో 90 సీట్లకు గాను 48 చోట్ల గెలిచింది. అధికారం మాదేనని మధ్యాహ్నం వరకు ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి అక్కడి ఓటర్లు షాక్‌ ఇచ్చారు. దీంతో ఆపార్టీ 37 సీట్లకే పరిమితమైంది. కొన్నిచోట్ల మెజారిటీలు అత్యల్పంగా ఉండటంతో రెండు పార్టీ మధ్య ఓట్ల తేడా స్వల్పంగానే ఉన్నది. దీంతో ఈ ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ నేతలు ఈసీ పనితీరుతో పాటు ఈవీఎంలపైనా ఆరోపణలు చేశారు. 

Tags:    
Advertisement

Similar News