ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాషాయ పీఠాన్ని బద్దలు కొట్టిన 'ఆప్'
Advertisement
15 ఏళ్ళ బీజేపీ పాలనను బద్దలు కొట్టి ఢిల్లీ మున్సి పల్ కార్పోరేషన్ (MCD)పై ఆమ్ ఆద్మీ పార్టీ జెండా ఎగరేసింది. MCDఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు అవసరమైన 126 స్థానాల కన్నా ఎక్కువగా 134 స్థానాలు దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ పై విజయం సాధించింది. బీజేపీకి ఇప్పటి వరకు 104 సీట్లు దక్కగా కాంగ్రెస్ కు 9 సీట్లు దక్కాయి.ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు.
15 ఏళ్ళ పాటు కార్పోరేషన్ లో అధికారంలో ఉన్న బీజేపీకి ఇది ఊహించని దెబ్బే. అయితే అందరూ ఊహించినట్టు కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ సీట్లతో తన బలహీనతను చాటుకుంది. ఓట్ల పరంగా చూస్తే, ఆమ్ ఆద్మీ పార్టీకి 42.05% ఓట్లు , భారతీయ జనతా పార్టీకి 39.09% ఓట్లు వచ్చాయి.
Advertisement