ఆలయంలో పైకప్పు కూలి బావిలో పడ్డ 30 మంది భక్తులు, 8మంది మృతి!

ఇండోర్ బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఈ రోజు రామ నవమి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్థలాభావం వల్ల భక్తులు ఆలయంలో ఉన్న బావి పైకప్పుపైకి ఎక్కి కూర్చున్నారు. ఆ బరువును తట్టుకోలేని పైకప్పు కూలిపోవడంతో పైన‌ కూర్చున్న 30 మందికి పైగా భక్తులు బావిలో పడిపోయారు.

Advertisement
Update:2023-03-30 17:24 IST

మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ దేవాలయంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 22 మందికి పైగా గాయాలపాలయ్యారు.

ఇండోర్ బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఈ రోజు రామ నవమి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్థలాభావం వల్ల భక్తులు ఆలయంలో ఉన్న బావి పైకప్పుపైకి ఎక్కి కూర్చున్నారు. ఆ బరువును తట్టుకోలేని పైకప్పు కూలిపోవడంతో పైన‌ కూర్చున్న 30 మందికి పైగా భక్తులు బావిలో పడిపోయారు.

వెంటనే రంగంలోకి దిగిన ఆలయ అధికారులు, సిబ్బంది తాళ్లు, నిచ్చెనలు ఉపయోగించి 19 మంది భక్తులను బయటకు తీసుకువచ్చారు. గాయపడ్డవారినందరినీ ఆస్పత్రికి తరలించారు. 8మంది మరణించారని ఇండోర్ పోలీసు చీఫ్ మకరంద్ దేవస్కర్ తెలిపారు.మిగతావారిని రక్షించేందుకు సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ధిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. "ఇండోర్‌లో జరిగిన దుర్ఘటన చాలా బాధ కలిగించింది. సీఎం చౌహాన్ శివరాజ్ జీతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన రెస్క్యూ , రిలీఫ్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది." అని ఆయన ట్వీట్ చేశారు. .

Tags:    
Advertisement

Similar News