పడవ బోల్తా.. 14 మంది విద్యార్థులు గల్లంతు
ప్రమాదం విషయం తెలియగానే స్థానికులు నాటు పడవలతో సహాయక చర్యలు చేపట్టి 18 మంది విద్యార్థులను కాపాడారు. మరో 14 మంది ఆచూకీ గల్లంతైంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
బిహార్‌లో ఘోర దుర్ఘటన జరిగింది. 32 మంది విద్యార్థులతో పాఠశాలకు వెళ్తున్న పడవ భాగమతి నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మంది ఆచూకీ గల్లంతైంది. ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పక్క గ్రామంలో ఉన్న పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు పడవలో భాగమతి నది దాటి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో పడవలో 32 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదం విషయం తెలియగానే స్థానికులు నాటు పడవలతో సహాయక చర్యలు చేపట్టి 18 మంది విద్యార్థులను కాపాడారు. మరో 14 మంది ఆచూకీ గల్లంతైంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై సమాచారమందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ముజఫర్‌పూర్ పర్యటనలోనే ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
*